Chada Venkat Reddy | చిగురుమామిడి, జూలై 19 : కమ్యూనిస్టు ఉద్యమంలో సిద్ధాంతాలకు కట్టుబడి అమరులైన నాయకుల సేవలు మరువ లేనివని సీపీఐ జాతీయ నేత చాడ వెంకటరెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో మాజీ ఎంపీపీ వేముల వెంకటరాజం మొదటి వర్ధంతిని పురస్కరించుకుని వారి నివాసంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ విషయాలను అడిగి తెలుసుకున్నారు. వెంకట రాజం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో పాల్గొన్నారనీ, చివరి వరకు పార్టీ కోసం కృషి చేశాడని కొనియాడారు. నేటి తరానికి వారి స్ఫూర్తి ఎంతో దోహదపడుతుందన్నారు.
అనంతరం రేకొండలో సిపిఐ నాయకులు సూరం ఐలయ్య తండ్రి ఇటీవల మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట నియోజకవర్గ కన్వీనర్ జాగిరి సత్యనారాయణ, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందే చిన్నస్వామి, బోయిని వల్లభాయ్ పటేల్, బూడిద సదాశివ, తేరాల సత్యనారాయణ, కాంతాల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శి ఉస్మాన్ పాషా, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి దుద్దేల సమ్మయ్య, మాజీ ఎంపీటీసీ పరకాల కొండయ్య, తమ్మిశెట్టి రవీందర్, బింగి స్వామి తదితరులున్నారు.