korutla Mla Sanjay | కోరుట్ల : ప్రజా రంజక పాలకుడు శ్రీరామచంద్రుడని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సకల గుణ సంపన్నుడు రాముడని ఎన్నో కష్టాలు ఎదురైనా ఈనాడు కూడా ధర్మం వీడలేదని రామచంద్రుడు పాలన ప్రజారంజకంగా కొనసాగిందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేపట్టారు అంతకుముందు ఖాది అనుమానాలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తిని ఎదుర్కోలు కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పల్లకి సేవలో పాల్గొనగా హనుమాన్ దీక్ష పరులు శ్రీరామ సంకీర్తనతో శోభాయాత్రగా కోదండ రామాలయం వరకు కొనసాగింది.
అనంతరం పేద పండితుల వేద మంత్రాల మధ్య సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాదాలతో పాటురామ రసాన్ని ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం యువజన స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో మజ్జిగ చల్లని నీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. నాట్యమండలి ఆధ్వర్యంలో శ్రీరాముని జీవిత గాధను చిన్నారి కళాకారుల నాట్యనృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ ప్రాజెక్టు సత్కరించి అభినందించారు.
అలాగే వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు మైలారపు లింబాద్రి, పట్టణాధ్యక్షుడు రాంబాబుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రి శ్రీరామనమే పురస్కరించుకొని సామూహిక దంపతుల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. ఆయా కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సేవాసమితి సభ్యులు హనుమాన్ దీక్షాపరులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.