Journalists | మల్లాపూర్, జూన్ 24 : తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమాని బీజేపీ పార్టీ రాష్ట్ర నేత చిట్నేని రఘు అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల బీజేపీ పార్టీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోస్టల్ భీమా పథకాన్ని స్వంత ఖర్చులతో చేయించి సంబధిత బాండ్లను మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించాలని, కరోనా లాంటి విపత్కార పరిస్థితుల్లో జర్నలిస్టులు ఎనలేని సేవలను చేశారని గుర్తు చేశారు. ఇక్కడ మండలాధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మీ, బీజేవైఎం మండలాధ్యక్షుడు పందిరి నాగరాజ్, ఉపాద్యక్షుడు లవంగ శివ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రమేష్, గుగ్గిళ్ల రాజశేఖర్, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.