Role model | జ్యోతినగర్, జూన్ 12: ఎన్టీపీసీ టీటీఎస్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ఎండీ జావీద్ తాను విద్యబోధన చేస్తున్న పాఠశాలలో తన కుమారుడు నవీద్ రెహమాన్‌కు అడ్మిషన్ చేసి తోటి ప్రభుత్వ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచాడు. జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్ మండలం నుంచి గత ఏడాది బదిలీపై వచ్చిన జావిద్ స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ డైరెక్టర్‌గా పాఠశాలలో పనిచేస్తున్నాడు.
వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి ప్రారంభమైన నూతన విద్య సంవత్సరంలో జావిద్ ఉపాధ్యాయుడు పనిచేస్తున్న పాఠశాలకు తన కుమారుడుతో వచ్చి ఏడోతరగతిలో అడ్మిషన్ చేయించడం పట్ల పాఠశాల హెచ్ఎం జయరాజ్, తోటి ఉపాధ్యాయులు జావిద్, అతని కుమారిడిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. అలాగే జావిద్ తన చిన్న కుమారుడు టీప్ ఉల్ రహమాన్‌ను ఎన్టీపీసీలోని దుర్గయ్యపల్లి ప్రభుత్వ పాఠశాలలో నేడు శుక్రవారం నాల్గో తరగతికి అడ్మిషన్ స్వీకరించనున్నట్లు తెలిపారు.
ప్రవేటు పాఠశాలలో అధిక ఫీజులు చేల్లిస్తూ ఆర్థికంగా నష్టపోతున్న తల్లిదండ్రులకు ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న అన్ని రకాల మౌళిక వసతులు, నాణ్యమైన విద్య బోధనను స్పూర్తిగా తీసుకోని తన ఇద్దరు కుమారులను ప్రభుత్వ బడిలో చదివించడం తోటి ఉపాధ్యాయులకు, ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ఉపాధ్యాయుడు జావిధ్ ఆదర్శంగా నిలిచాడు.