Ramagundam | రామగుండంలో కౌన్సిల్ మీటింగులు ఎత్తివేయడానికి కారణం చెప్పాలి.. బీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య
రాష్ట్రంలో ఒకతీరు, రామగుండం నగర పాలక సంస్థలో మరో తీరు కొనసాగుతుందనీ, ప్రతీ నెల నిర్వహించాల్సిన కౌన్సిల్ మీటింగ్ లను ఎత్తివేయడానికి గల సాంకేతిక కారణాలేమిటో ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ రామగుండం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ డిమాండ్ చేశారు.
Ramagundam | కోల్ సిటీ, సెప్టెంబర్ 17 : రాష్ట్రంలో ఒకతీరు, రామగుండం నగర పాలక సంస్థలో మరో తీరు కొనసాగుతుందనీ, ప్రతీ నెల నిర్వహించాల్సిన కౌన్సిల్ మీటింగ్ లను ఎత్తివేయడానికి గల సాంకేతిక కారణాలేమిటో ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ రామగుండం మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ డిమాండ్ చేశారు. నగర పాలక కార్యాలయంలో కమిషనర్ జే అరుణ శ్రీని గురువారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురపాలక చట్టం ప్రకారం ప్రతీ నెల క్రమం తప్పకుండా కౌన్సిల్ మీటింగ్ లు నిర్వహించాలన్న నిబంధన రామగుండం కార్పొరేషన్ కు మినహాయించారా..? అని ప్రశ్నించారు.
అధికారుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ లో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. తమను నమ్ముకొని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిని ప్రతీ కార్పొరేటర్ ఎదుర్కొంటున్నారన్నారు. పాలక వర్గం ఏర్పడి 8 నెలలు గడుస్తున్నా రెండవ కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. మొదటి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించిన సమస్యలను ఎంతవరకు పరిష్కరించారో చెప్పాలని పట్టుబట్టారు. రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా ఇకనైనా రెండవ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఆ సంప్రదాయంను కొనసాగించి కార్పొరేషన్ పరువు కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో 6వ డివిజన్ బీఆర్ఎస్ ప్రతినిధి తోకల రమేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

