Sarangapur | సారంగాపూర్, డిసెంబర్ 4 : రైతులు ధాన్యం కొనుగోల్లు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత అన్నారు. గురువారం బీర్ పూర్ మండలంలోని తుంగూర్, కొల్వయి, తాళ్లధర్మారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను జిలా అదనపు కలెక్టర్ బిఆస్ లత ఆకస్మికంగా తనికీలు చేసి వివరాలు తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ఆయా కేంద్రాలలో రైతులతో మాట్లాడి వివరాలు తెల్సుకున్నారు. రైతులకు ఏలాంటి నష్టం జరగకుండా ధాన్యం కొనుగోలుల చేయాలని నిర్వహకులకు సూచించారు.
కేంద్రాలకు వచ్చె ధార్యం ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తేమశాతం తప్పని సరిగా పరిశీలించి నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలుల చేపట్టాలని, కొనుగోలు చేసిన వెంటనే రైస్ మీల్లులకు తరలించాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు. క్లస్టర్ అధికారులకు కేటాయించిన కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన బరువు యంత్రాల నిర్వహణ, ధాన్యం కొనుగోల్లు వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో తహసీల్దార్ సుజాత, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సివిల్ సప్లయ్ అధికారులు, సెంటర్ల నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.