గుమ్మడిదల, ఫిబ్రవరి23: మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సూచించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశానికి సోమవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ సీహెచ్.కుమార్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ చిమ్ముల సంధ్యాగోవర్ధన్రెడ్డి, కౌన్సిలర్లు కొలువు తీరిన సందర్భంగా వారికి ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర నెలల క్రితం మున్సిపాలిటీకి రూ.15 కోట్లు విడుదలైనట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని సూచించారు.
పారిశ్రామికవాడ కావడంతో పరిశ్రమల నుంచి వచ్చే సీఎస్ఆర్ నిధులతో మరింత అభివృద్ధి చేయాలని కోరారు. ఐదేంండ్ల పాటు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. ముందు చైర్మన్ కుమార్‌గౌడ్, వైస్ చైర్పర్సన్ సంధ్యాగోవర్ధన్రెడ్డితో పాటు నూతన కౌన్సిలర్లకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా కొలువు తీరిన పాలకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిని సన్మానించింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దశరథ్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.