Minister Ponnam Prabhakar Goud | సైదాపూర్ : కేంద్రం సరిగా యూరియా సరఫరా చేయకపోవడం వల్లనే ఎరువుల సమస్య వచ్చిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆరోపించారు. సైదాపూర్ మండలంలోని నల్లరామయ్యపల్లిలో నూతన గ్రామ పంచాయితీ భవనం, ఆకునూర్ కేజీవీబీలో డార్మెంటరీహాల్, వెంకటేశ్వర్లపల్లి బూడిదపల్లిలోఓపెన్హామ్, ఎక్లాస్‌పూర్‌లో నూతన గ్రామ పంచాయితీ భవనంను ఆయనప్రారంభించారు. నల్లాని రామయ్యపల్లి, ఎక్లాస్‌పూర్‌లో మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకులను అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులకు సంబందించి రోజు కలెక్టర్‌తో మాట్లాడుతున్నామని, ఎరువులు రాష్ట్రంలో తయారు కావని కేంద్రంలో ఆధీనంలో తయారు జరుగుందని చెప్పారు. రైతులు ఎరువులకోసం లైన్లో నిల్చునే పరిస్థితి రావద్దని, కేంద్రం సరిగా సరఫరా చేయకపోవడం వల్ల సమస్యవచ్చిందని ఆరోపించారు. మిగతా వాటికంటే కొంత మెరుగైనా ఇక్కడ కూడా రైతులు ఎరువులకోసం లైన్లో నిల్చోవడం అనేది నాకు మంచిగా అనిపించలేదని, దానికి నేనూ కూడా భాధ్యతవహిస్తున్నా వాస్తవాలు కొన్ని ఒప్పుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఎరువుల సరఫరా అంతా కేంద్రం వద్దనే ఉంటదని, యూరియా రాష్ట్రానికి కేంద్రం నుండి రావాలని, సరిపడా యూరియా కేంద్రం పంపడం లేదని, యూరియా కొరతను అధిగమించేకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. గ్రామాల్లో మహిళా సంఘాలకు స్టీల్ వస్తువులను అందిస్తున్నామని, ప్లాస్టిక్ వాడకుండా స్టీల్ వస్తువులను వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సమేలా సత్పతి, ఆదనపు కలెక్టర్లు లక్ష్మికిరణ్, అశ్విని తానాజి వాఖడే, ఏఎంసీ చైర్మన్ దొంత సుధాకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతిరెడ్డి, తహసీల్దార్ గుర్రం శ్రీనావాస్, ఎంపీడీఓ యాదగిరి, వ్యవసాయాధికారి వైదేహి, వివిధ శాఖల అధికారులునాయకులు ఉన్నారు.