CMRF cheques | హుజురాబాద్ టౌన్, జూన్ 23: సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా ఆపదలో ఉన్న పేదలకు లబ్ధి చేకూరుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలు, రెండు పట్టణాలకు చెందిన 198 మంది లబ్ధిదారులకు రూ.75లక్షల67వేల విలువ గల చెక్కులను సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.