Thimmapur | తిమ్మాపూర్ ముంపు ఏరియాలో పండిన వరిపంటను కొనుగోలు చేయాలి.. తహసీల్దార్‌ను కోరిన భాధిత రైతులు
ముంపునకు గురై ఎఫ్టీఎల్కు దూరంగా ఖాళీగా ఉన్నటువంటి భూములలో ఒక సీజన్ వ్యవసాయం చేసుకుంటూ పండించిన వరి పంటను అధికారులు కొనుగోలు చేసేలా సహకరించాలని రామక్రిష్ణకాలనీ గ్రామ రైతులు తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డిని కోరారు.
Thimmapur | తిమ్మాపూర్, మే 13 : ముంపునకు గురై ఎఫ్టీఎల్కు దూరంగా ఖాళీగా ఉన్నటువంటి భూములలో ఒక సీజన్ వ్యవసాయం చేసుకుంటూ పండించిన వరి పంటను అధికారులు కొనుగోలు చేసేలా సహకరించాలని రామక్రిష్ణకాలనీ గ్రామ రైతులు తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డిని కోరారు. ఈ మేరకు బాధిత రైతులు ఆయనను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఎల్ఎండీ రిజర్వాయర్ పరిధిలో ముంపునకు గురైన భూములలో సుమారు 70 మందికి పైగా గత 25 ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ తద్వారా వచ్చిన పంటలను అమ్ముకుంటూ వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని, ఇలా పండించిన వరి ధాన్యాన్ని స్థానిక కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేయడం లేదని వాపోయారు.
న్యాయవాది సుగుర్తి జగదీశ్వరాచారి ఆధ్వర్యంలో వారు తహసీల్దార్‌ను కలిసి సమస్యను వివరించారు. వ్యవసాయం తప్ప వేరే పనులు అలవాటు లేని తాము ఇలాంటి భూములలో పండిస్తున్న పంటలను మానవతా దృక్పథంతో ఆలోచించి కొనుగోలు చేయాలని వినతిపత్రం ద్వారా కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లో రైతు ద్వారా ధ్రువీకరించిన పత్రంనకు వ్యవసాయ అధికారి ద్వారా అనుమతి తీసుకొన్న తర్వాత కొనుగోలు చేశారని అదే విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదించి కొనుగోలు చేసేలా సహకరించాలని రైతులు గోనెల భూమయ్య, గంగు రాజమల్లు, కోతి మల్లేశం, ఆవుల లచ్చయ్య, గంగు తిరుపతి, అట్ల అంజయ్య తదితరులు తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం అరుణ్, కోతి రాజు ఉన్నారు. ఉన్నతాధికారులకు నివేదించి సమస్య పరిష్కారం చేస్తానని తహసీల్దార్ హామీ ఇచ్చారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

