Siricilla | అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు.. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్
అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం సిరిసిల్ల పట్టణంలోని బీఆర్ఎస్ విద్యార్థులు, నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
- విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్
Siricilla | సిరిసిల్ల టౌన్, మార్చి 24: అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో సోమవారం సిరిసిల్ల పట్టణంలోని బీఆర్ఎస్ విద్యార్థులు, నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సబ్బని హరీష్ మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో విద్యారంగానికి తొలి ప్రాధాన్యత కల్పించాలని గుర్తు చేశారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో భాగంగా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేశారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ తో అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న తమను ముందస్తు అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ చేస్తున్న పోరాటాన్ని ఆపలేరని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. ప్రజా సంక్షేమం కోసం పోరాటాలు తమకు కొత్త కాదన్నారు. విద్యారంగానికి నిధులు కేటాయించే వరకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అరెస్టైనవారిలో బీఆర్ఎస్వీ విభాగం నాయకులు కంచర్ల రవి గౌడ్, షేక్ సికిందర్, ఆఫ్రోజ్, శ్రీనివాస్, అజ్జు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

