కోనరావుపేట, మార్చి 30 : కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులు గుంపులుగా సంచరిస్తూ చేతికొచ్చి న పంటలను నాశనం చేస్తున్నాయి. ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు ఎత్తిపోయి పొట్ట దశలో ఉన్న వరి పంటను ఎలా కాపాడుకోవాలని రైతులు మదనపడుతూంటే, ఇంకోవైపు కోతులు పదుల సంఖ్య లో పొట్ట దశలో ఉన్న వరి గింజలను కొరికేస్తూ, పంటను తొక్కేస్తున్నాయి. దీంతో రైతు లు పొద్దంతా కోతుల కాపాలా ఉంటూ, పంట రక్షణ కోసం పడరానిపాట్లు పాడుతున్నారు. కోతుల నియంత్రణకు ప్రభుత్వం, ఇటు అధికార యంత్రాంగం పట్టించుకోవ డం లేదని రైతులు వాపోతున్నారు.
ఆరుగాలం శ్రమించి పంటలు పండించుకుంటున్న రైతులకు కోతులతో కష్టాలు తప్ప డం లేదు. ఒక రకంగా మండల ప్రజలు, కో తుల మధ్య కొన్నేళ్లుగా ఒక యుద్ధమే జరుగుతోంది. ప్రధానంగా శివంగాళపల్లి, ఏగ్లాస్పూ ర్, వట్టిమల్ల, మామిడిపల్లి, మరిమడ్ల, కనగర్తి, మంగళ్లపల్లి గ్రామాలతోపాటు పలు గ్రా మాల్లో కోతుల బెడద తీవ్రరూపం దాల్చింది. ఆయా గ్రామాల్లో సాగు చేసిన వరి, మొక్కజొన్న, కూరగాయాల వంటి పంటల్లో కోతు లు చొరబడి నానా భీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ పంటలను పాడు చేస్తున్నాయి. రైతులు పెద్ద కర్రలతో వాటిని తరిమే ప్రయత్నం చేసిన ఫలితం లే కుండా పోతుంది. దీంతో పంట చేతికొచ్చే స్థితిలో కోతులు దాడి చేస్తుండడంతో సరైన దిగుబడి రాక నష్టాలు మిగులుతున్నాయని రైతులు చెపుతున్నారు. రైతులు పంటల రక్షణకు పడరాని పాట్లు పడుతున్నారు. కోతులు పంట పొలాలకు రా కుండా చుట్టూ పాత చీరెలు, వలలు ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల మైకులు, పెద్దగా శబ్ధం వచ్చే గన్నులు వంటి వాటిని వినియోగిస్తున్నారు. కనగర్తి వంటి గ్రామాల్లో ఖర్చుతో కూడిన సొలార్ కంచెలు సైతం ఏర్పాటు చేశారు.
మండలంలో చుట్టూ అటవీ విస్త్తీర్ణం అధికంగా ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి కోతులను వ్యాన్లలో పట్టుకువచ్చి రాత్రి పూట వదిలివెళ్తున్నారు. ఇలా ఊరుబయట రోడ్లపై వదలడంతో అవి మళ్లీ గ్రామాల్లో ప్రవేశించి ఇండ్లలో చొరబడుతున్నాయి. గ్రామస్తులు వాటిని వెంబడిస్తే తిరిగి చెట్ల పొదలు, గుట్టల్లో చేరి, ఆకలి సమయాల్లో పంట చేలల్లో చేరుతున్నాయి. ఇదంతా జరుగుతున్న కోతుల నియంత్రణ కోసం అధికారులు చర్యలు చేపట్టడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కో తులను బంధించి, వాటి నియంత్రణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించి కోతుల బారి నుంచి రక్షణ కల్పించాలని పలువురు డి మాండ్ చేస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి కోతల సమస్య నుంచి విముక్తి కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు.
మామిడిపల్లి గ్రామ శివారులోని మూలవాగును ఆనుకొని రెండెకరాల వరి పంటను సాగుచేశా. బోరు మోటరు సా యంతో వరి పంటకు నీళ్లు పారిస్తున్నా. వరి ఇప్పుడు పొట్ట దశలో ఉండగా నీరు సరిగా అందడం లేదు. ఓ వైపు పొద్దంతా కరెంటు నీళ్ల పైపులు సరిచేస్తూ వరి పంట ఎండిపోకుండా ప్రయత్నాలు చేస్తున్నా. మరోవైపు కోతులు పదుల సంఖ్యలో పంట పొలంలో చొరబడి నాశనం చేస్తున్నాయి. కరెంటు పెట్టాలా, కోతుల నుంచి పంటను కాపాడుకోవాలా అర్థం కావ డం లేదు. కోతులు పంటను పూర్తిగా తొక్కేయడంతో ఎకరం పంట పొలం పూర్తిగా పాడైపోయింది. అధికారులు, పాలకులు ప్ర త్యేక చొరవ చూపి కోతల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
నాకు ఉన్న రెండెకరాల వరి పంటను సాగు చేయడంతోపాటు మరికొంత భూ మిని పంటను కౌలు సాగుచేస్తున్నా. పంట ప్రస్తుతం పొట్టదశలో ఉంది. కోతులు గుం పులు గుంపులుగా చేరుకుని పంట పొలం లో చొరబడుతున్నా యి. గోలను పూర్తిగా కొరికివేయడంతో పాటు పొలాన్ని తొక్కే సి నాశనం చేస్తున్నాయి. గ్రామంలో చాలా మంది రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. కోతులను కర్రతో కొట్టేందుకు వెళితే మీదికే ఉరికివస్తున్నాయి. వాటిని చూస్తేనే భయం వేస్తుంది. గ్రామంలో కోతుల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. పొలాన్ని రక్షించుకోవడానికి చుట్టుపక్కల రైతులమంతా కలిసి వెళ్తున్నాం. కోతుల బెడదకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.