కరీంనగర్ విద్యానగర్, ఆగస్టు 24: అడ్డదారుల్లో వైద్య వృత్తిలోకి ప్రవేశించిన నకిలీ ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ బృందం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ వైద్య మండలి చైర్మన్ మహేశ్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మేరకు సభ్యుడు రాజకుమార్ ఆధ్వర్యంలోని వైద్య బృందం శనివారం గంగాధర మండలంతోపా టు కొత్తపల్లిలో పట్టణంలో క్లీనిక్‌లపై దాడులు చేసింది. తనిఖీల్లో ఆర్ఎంపీ, పీఎంపీల విద్యార్హతలు తెలుసుకొని కంగుతిన్నది. పదో తరగతి, చదువు మధ్యలో మానేసిన వారు, ఎలాంటి విద్యార్హతలేని వారు అడ్డదారుల్లో వైద్య వృత్తిలోకి వచ్చినట్టు గుర్తించింది.
ఈ మేరకు గంగాధరలోని రాము సహస్ర క్ల్లీనిక్, మల్లేశం మహేశ్వర మెడికల్స్, కట్ల మల్లేశం శ్రీరామ క్ల్లీనిక్, అంజిబాబు క్ల్లీనిక్, కురిక్యాల లో యాదగిరి సంపత్ క్ల్లీనిక్ పేరుతో అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్నట్టు గుర్తించింది. కొత్తపల్లిలో రాజమౌళి క్లినిక్, రఘు అనే వ్యక్తి మధు క్లినిక్ పేరుతో వైద్యం చేస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. క్లీనిక్‌లను సీజ్ చేసింది.
సదరు వైద్యులు ఆంటిబయాటిక్స్, స్టెరాయిడ్స్ ఇస్తునట్టు గుర్తించి తగు ఆధారాలు సేకరించింది. మెడిసిన్‌ను స్వాధీనం చేసకున్నది. వీరిపై నేషనల్ మెడికల్ కౌన్సిల్ చట్టం 34,54 ప్రకారం వీరిపై కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపింది. తనిఖీల లో కరీంనగర్ ఆంటీ క్వాకరీ బృందం సభ్యు లు, హెచ్ఆర్డీఏ సెక్రటరీలు శరణ్ సాయి, గౌతమ్ ఉన్నారు. తనిఖీల సమాచారంతో మరికొందరు అలెర్ట్ అయ్యారు. తమ క్లీనిక్స్, ల్యాబ్స్, మెడికల్ షాప్స్‌ని మూసేశారు.