Banda Srinivas | రైతన్నను అరిగోస పెడుతున్న ప్రభుత్వం.. బీఆర్ఎస్ రాష్ర్ట కార్యదర్శి బండ శ్రీనివాస్
రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతీ గింజను కొనుగోలు చేయాలి
Banda Srinivas | హుజూరాబాద్ రూరల్, మే19 : రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకుండా అరిగోస పెడుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. క్వింటాల్ వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రగల్బాలు పలికిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం పండించిన పంటను కూడా కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్లాల మీదే ధాన్యం కొనుగోలు చేసేవారని గుర్తు చేశారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ప్రైవేట్ వ్యాపారులు కొర్రీలు పెడుతూ ఒక్కో బస్తా మీద నాలుగు నుంచి ఐదు కిలోల తరుగు తీయడంతో పాటు ధాన్యానికి ప్రభుత్వ మద్ధతు ధర చెల్లించడం లేదని అన్నారు. ప్రభుత్వం వహిస్తున్న అలసత్వం వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, పలువురు రైతులు మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు కూడా పాల్పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఎద్దు ఏడ్చిన యవుసం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడిన చరిత్ర లేదనే సత్యాన్ని గ్రహించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి వెంటనే రైతు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని, లేని పక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya Maran Marriage | కేటీఆర్కు కళానిధి మారన్ దంపతుల ఆహ్వానం.. కావ్య మారన్ వివాహ రిసెప్షన్కు రావాలని పిలుపు!
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

