EX sarpanches Bills | హుజూరాబాద్ టౌన్, మే 27 : తమ బిల్లులు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని రంగాపూర్ మాజీ సర్పంచ్ బింగి కరుణాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ముఖ్యమంత్రి ఇంటి ముట్టడికి మాజీ సర్పంచులు వెళ్తున్నారనే సమాచారంతో హుజూరాబాద్, ఇల్లంతకుంట మండలానికి చెందిన మాజీ సర్పంచులను తెల్లవారుజామున హైదరాబాద్ కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా కరుణాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీ బిల్లులు రూ.153 కోట్లు, ఎస్టీఎఫ్ గ్రాంట్ రూ.85 కోట్లు చెల్లించినట్టు ప్రగల్భాలు పలికిందన్నారు. సర్పంచుల బిల్లులు చెల్లిస్తే ముందస్తు అరెస్టులు ఎందుకు అని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శులు చేసిన చిన్న చిన్న పనులకు బిల్లు చెల్లించిందని, వాటిని సర్పంచులకు చెల్లించినట్టు ప్రచారం చేసుకుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించకపోగా అరెస్టులతో మాజీ సర్పంచులను మానసికంగా, ఆర్థికంగా కుంగ తీసే ప్రయత్నం చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు కమిషన్లు తీసుకొని పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిందని అన్నారు. కిందిస్థాయిలో జరిగిన అభివృద్ధి పనుల బిల్లులను చెల్లించడంలో ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేస్తుందన్నారు.
కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పనులకు మాత్రమే బిల్లులు చెల్లించారని ఆరోపించారు. అరెస్టైన వారిలో హుజూరాబాద్ మండలానికి చెందిన మాజీ సర్పంచులు చేరాల మనోహర్, లక్ష్మారెడ్డి, తిరుపతి, కిరణ్, ఇల్లంతకుంట మాజీ సర్పంచులు తిప్పారపు మొగిలి,కంది దిలీప్ రెడ్డి, మూడెత్తుల వెంకటస్వామి తదితరులు ఉన్నారు.
Rains | హైదరాబాద్కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు