సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టిపెట్టింది. మరమ్మతులు, మౌళిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేసింది. కరీంనగర్ జిల్లాలో 64 హాస్టళ్లు ఉండగా 32 లక్షలు మంజూరు చేసింది. ఒక్కో హాస్టల్కు 50 వేల చొప్పున కేటాయించింది. పకడ్బందీగా పనులు చేపట్టి వేసవి సెలవుల్లోగా పూర్తిచేయాలని సంబధిత అధికారులను ఆదేశించింది.
– కలెక్టరేట్, మే 7
ఉమ్మడి పాలనలో కనీస వసతులు కరువైన సంక్షేమ హాస్టళ్లలో పెండింగ్లో ఉన్న సమస్య లు పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వేసవి సెలవుల్లో మరమ్మతులు చే పట్టాలని సంకల్పించింది. వచ్చే విద్యాసంవత్సరంలోగా సకల హంగులతో అందుబాటులోకి తేచ్చేందుకు చర్యలు చేపడుతున్నది. మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేస్తూ, ఉత్తర్వులు వెలువరించింది. వసతుల కల్పనపై దృష్టి సారించిన అధికారులు, ప్రస్తుత అవసరాలను గుర్తించి ప్రతిపాదనలు రూపొందించి, ఆ యా సంక్షేమ శాఖల కమిషనర్లకు అందజేశా రు. దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చే సింది. ఆయా హాస్టళ్లలో సమస్యలను ప్రాధాన్య త క్రమంలో పరిష్కరించాలని సూచించింది.
జిల్లాలో 64 హాస్టళ్లు
కరీంనగర్ జిల్లాలో ఎస్సీ అభివృద్ధి, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో 64 వసతి గృహాలు కొనసాగుతున్నాయి. వీటిలో 36 ప్రభుత్వ భవనా ల్లో కొనసాగుతుండగా, 28 అద్దె ఇండ్లల్లో నిర్వహిస్తున్నారు. అందులో పోస్ట్ మెట్రిక్, ప్రీమెట్రిక్ విద్యార్థులు వసతి పొందుతూ చదువుకుంటున్నారు. అయితే, సొంత భవనాలతో పాటు అద్దె భవనాల్లో కూడా పలు సమస్యలు వస్తుండగా, ఆయా హాస్టళ్ల వెల్ఫేర్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత దసరా సె లవుల్లోనే మరమ్మతుకు నిధులు విడుదల చేసి నా, కొన్నిచోట్ల పనులు చేపట్టలేదు. తాత్కాలికంగా సౌకర్యాలు కల్పించారు.
ఈ వేసవిలో అన్ని హాస్టళ్లలో పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేపట్టి, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గం గుల కమలాకర్ ఆదేశించడంతో, ఇప్పటికే బీసీ హాస్టళ్లకు నిధులు విడుదల చేశారు. నేడో, రేపో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వసతి గృహాలకు కూడా నిధులు కేటాయించే అవకాశాలున్నట్లు ఆయాశాఖల అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ హాస్టళ్లకు కూడా గత నెల 24 నుంచే వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి హాస్టళ్లు సరికొత్త సౌకర్యాలతో విద్యార్థులను ఆహ్వానించేలా తీర్చిదిద్దాలంటూ హెచ్డబ్ల్యూవోలకు సూ చించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.