లయన్ ఎరబాటి వెంకటెశ్వర్ రావు..
గౌరెడ్డిపేటలో విద్యార్థులకు ఒక్కోజత షూలు పంపిణీ..
పెద్దపల్లి రూరల్ సెప్టెంబర్ 17 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక చేయూతగా ఉండాలన్నదే తమ లక్ష్యమని రెడ్ క్రాస్ సొసైటీ స్టేట్ మేనేజ్ మెంట్ కమిటీ సభ్యుడు, లయన్ ఎరబాటి వెంకటెశ్వర్ రావు అన్నారు. పెద్దపల్లి మండలంలోని గౌరెడ్డిపేటలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెడ్ క్రాస్ సొసైటీ పేరున 68 మంది విద్యార్థులకు ఒక్కోజత షూలను పాఠశాల హెచ్ ఎం సమక్షంలో అందజేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు పేదవర్గాలకు చెందిన వారి పిల్లలే విద్యను అభ్యసిస్తారని అలాంటి వారికి విద్యా సామాగ్రి అందించి ఆర్థిక చేయూతగా ఆదుకోవాలన్న లక్ష్యంతోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు విడుతల వారిగా వివిద రకాల చేయూత కార్యక్రమాలను రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ల ద్వారా పలు సేవకార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు గుర్తింపు కార్డులు, టై , బెల్టులు అందిస్తామని విద్యార్థులు చక్కగా చదువుకొని ప్రయోజకులుగా మారాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ ఎం ఎండీ షమీయుల్లా ఖాన్ , ఉపాధ్యాయులు కోటేశ్వర్ రావు, భారతీ , హుస్సేన్ , స్వరూప, రఫత్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.