Korukanti Chander | గోదావరిఖని : అక్రమంగా కూల్చివేసిన సిరిశేట్టి మల్లేశంకు న్యాయం జరిగేదాక పోరాటం ఆగదని, రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్న నియంతృత్వ దుర్మార్గ పాలన సభ్య సమాజం ఖండించాలని, బాధితులకు అండగా నిలువాలని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చందర్
పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో మల్లేష్ చేపడుతున్న దీక్షకు అఖిలపక్ష జేఏసీ నాయకులు సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ రెండు సంవత్సరాల కాలంగా సుందరీకరణ అభివృద్ధి సాకుతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కుల్చివేతల పర్వం కోనసాగుతుందన్నారు. అభివృద్ధి పేరిట దుకాణాలు కుల్చుతూ వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా సామాన్యుల జీవితాలతో రోడ్డున పడేసారన్నారు. గత ఐదు రోజులగా దీక్ష చేస్తున్న ఇక్కడి ఎమ్మెల్యే గాని, సింగరేణి అధికారులు కలెక్టర్ స్పందించకపోవడం సరైందికాదన్నారు.
ఉద్యమాల పురిటగడ్డ గోదావరిఖని లో కార్మిక సంఘలు కుల సంఘాలు రాజకీయ పార్టీ లను కలుపుకోని జే.ఎ.సి గా ఎర్పాడి మల్లేష్ కుటుంబానికి అండగా నిలిచామన్నారు. గతంలో గాంధీనగర్, ఎన్టీపీసి, లక్ష్మీ నగర్, ఓల్డ్ ఆశోక్ టాకీస్, చౌరస్తాలో కుల్చిన దుఖాణాలకు నష్టపరిహారం చెల్లించాలని, తిరిగి దుకణాలు నిర్మాణం చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం కోసం చేస్తున్న పోరాటం మల్లేష్ కుటుంబానికి ఈ ప్రాంతంలోని మానవతవాదులంతా స్పందించి అండగా నిలువాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అఖిల పక్ష జేఏసీ నాయకులు మూల విజయ రెడ్డి, పర్లపల్లి రవి, గోపు అయులయ్య యాదవ్,నారాయణదాసు మారుతి, సీఐటీయూ, హెచ్ఎంఎస్ యూనియన్ల నాయకులు రాజిరెడ్డి, తోట వేణు, బీజేపీ నాయకులు మేరుగు హన్మంత్ గౌడ్, కొండపర్తి సంజీవ్, కోమళ్ల మహేష్, న్యూ ఇండియా పార్టీ నాయకులు జేవీ రాజు, వేముల అశోక్, ఇప్టూ నాయకులు కృష్ణ, తెలంగాణ జాగృతి నాయకులు నిట్టూరి రాజు తదితరులు పాల్గొన్నారు.