MLA SANJAY | కోరుట్ల, ఏప్రిల్ 12: చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని, బాటసారుల దాహర్తిని తీర్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అన్నారు. పట్టణంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ కోరుట్ల కోటి నవదుర్గ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ భవనం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నదని, నిత్యం పరిసర గ్రామాల నుంచి పట్టణానికి వివిధ పనుల కోసం ప్రజలు వస్తుంటారని, వారి దాహర్తి తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గుంటుక చంద్రప్రకాష్, ఆర్సీ పోతని ప్రవీణ్ కుమార్, క్లబ్ చాటర్ ప్రెసిడెంట్ గుంటుక కవిత, వైస్ ప్రెసిడెంట్ పోతని శ్రీలత, ట్రేజరర్ మంచాల రోజా రమణి, పీజడ్సీలు అల్లాడి శోభ, మంచాల జగన్, ఎలిమెల్ల రామ్ నారాయణ, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.