Indiramma Housing Scheme | హుజురాబాద్ టౌన్, జూన్ 16: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదింటి సొంతింటి కలను నెరవేరుస్తున్నామని, అది కేవలం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. హుజురాబాద్ మండల పరిధిలోని పెద్దపాపయ్యపల్లి గ్రామంలో 27 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 20 మంది లబ్ధిదారులకు సోమవారం పట్టాల పంపిణీ చేశారు. ధర్మరాజ్ పల్లిలో పైలెట్ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను స్వయంగా గ్రామస్తుల తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ప్రణవ్ మాట్లాడుతూ భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రవేశపెట్టే ఏ పథకం అయినా ప్రజలకు చేరువలోకి తీసుకొస్తాననని అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన అనతికాలంలోనే పేదలకు తగిన న్యాయం చేసిందని అన్నారు. ఇవే కాక ఎన్నో ప్రజారంజక పథకాలతో పేదల కు సాయం అయితుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల నాయకులు,గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు.