BRS | ధర్మారం, ఏప్రిల్ 27: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో ఆదివారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నుంచి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలి వెళ్లారు. పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు ఈ ప్రాంత పార్టీ సీనియర్ నేత, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపుమేరకు 21 ప్రత్యేక బస్సులతో పాటు కార్లు ఇతర వాహనాలలో సుమారు 1,200 మంది ఉద్యమ తరహాలో తరలి వెళ్లారు.
అంతకుముందు మండల పరిధిలోని 29 గ్రామాలలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్టీ జెండా పండుగను జరుపుకున్నారు. అలాగే ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్ పార్టీ జెండాను ఎగురవేశారు.
ఈ కార్యక్రమంలో నంది మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, రైతు బంధు సమితి మాజీ జిల్లా సభ్యులు పూస్కురు రామారావు, మాజీ కోఆప్షన్ సభ్యుడు ఏండీ రఫీ, మాజీ ఎంపీటీసీ తుమ్మల రాంబాబు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, మండల పార్టీ ఉపాధ్యక్షులు గాజుల రాజు, నాడెం శ్రీనివాస్, పార్టీ అనుబంధ శాఖ అధ్యక్షులు దేవి నళినీకాంత్, దేవి వంశీకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, నాయకులు కాంపల్లి చంద్రశేఖర్, గంధం తిరుపతి, ఎండీ షరీఫ్, కొత్త మోహన్, ఆవుల శ్రీనివాస్, అజ్మీర శ్రీనివాస్ నాయక్, ఆవుల వేణుగోపాల్, దేవి అజయ్, సులిగే శేఖర్ అర్ధవేలి రాము, ఎండీ అజం బాబా, నార సంజీవ్, బోయిని రాజు, సుంచు ప్రశాంత్, అనవేని మహేందర్, దేవి రాజారాం, దేవి రేణుక, కాంపెల్లి అపర్ణ, రేగుల లక్ష్మి, మేడవేణి సుజాత తదితరులు పాల్గొన్నారు.