Jeevan Reddy | జగిత్యాల టౌన్, సెప్టెంబర్ 15 : గిరిజనులకు రిజర్వేషన్‌ను ఆరు నుండి పది శాతం పెంచిన ఘనత కేసీఆర్‌దేనని, అందుకు గుర్తుగా సెప్టెంబర్ 17న ప్రతీ తండాలో కేసీఆర్‌కు క్షీరాభిషేకం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా పరిషత్ తొలి ఛైర్పర్సన్ దావా వసంత సురేష్‌తో కలిసి మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల హక్కుల రక్షణ కోసం రిజర్వేషన్ 6 నుండి 10 శాతం పెంచారని, రిజర్వేషన్ పెంపు పై సెప్టెంబర్ 17న కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రతీ తండాలో కేసీఆర్‌కు క్షీరాభిషేకం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో దాడులు జరుగుతున్నాయని, పోలీస్ స్టేషన్ లో దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దాడి చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలి అని జీవన్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి అముల కానీ గిరిజనుల హక్కుల రక్షణతోపాటు, స్వయం పాలన కోసం తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు.
50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచకూడదనే ఇంద్ర సహాని కేసు ఉన్నప్పటికీ, గిరిజనుల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ 6 నుండి 10 శాతానికి పెంచి, న్యాయపరమైన చిక్కులు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం నివేదిక పంపినట్లు గుర్తు చేశారు. గిరిజనుల రిజర్వేషన్ పెంపు ను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా నాన్చడంతో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ధైర్యంగా రిజర్వేషన్ అమలు చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయాలకు అతీతంగా గిరిజనులు ఉద్యమించారని, గిరిజనుల హక్కుల రక్షణ కోసం, కేసీఆర్ గిరిజనులకు 10 శాతానికి పెంచడంతోపాటు రిజర్వేషన్‌తో గిరిజనులు రాష్ట్రంలో ఏటా వైద్య రంగంలో 440 మంది డాక్టర్లు సీట్లు పొందు తున్నారన్నారు. ప్రస్తుతం ఆంధ్రా రాష్ట్రంలో కేవలం 6 శాతం మాత్రమే ఉందని, కేసీఆర్ గిరిజనుల కోసం రిజర్వేషన్ 6 శాతం నుండి 10 శాతానికి పెంచినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా గిరిజను లకు హక్కులుకల్పించేందుకు కేసీఆర్ రిజర్వేషన్ 6 నుండి 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో ప్రజలకు పోలీస్ స్టేషన్ లో కూడా రక్షణ కరువైందన్నారు. నేరంతో సంబంధం లేకపోయిన అరెస్టు చేయడం, సీసీ కెమెరాలు ఉండగా కాంగ్రెస్ గుండాలు పోలీసు విచారణ గదిలోకి వెళ్లి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో దాడులు రేవంత్ రెడ్డి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ లో నడుస్తున్నా అన్నారు. కేటీఆర్ పీర్వో, పీఏలను విచారణ పేరిట పోలీసు స్టేషన్‌కు పిలిపించి దాడి చేయడం, పరోక్షంగా కేటీఆర్ పై కుట్ర పూరిత దాడియేనని అన్నారు. దాడి చేసిన గుండాల పై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ గిరిజనుల హక్కుల రక్షణ కోసం 6 నుండి 10 శాతం రిజర్వేషన్ పెంచారన్నారు. జీవన ప్రమాణలు పెందించేందుకు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి నీ అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలు చేపట్టారన్నారు. గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్నారు. గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినప్పటికీ గిరిజనుల హక్కులు కాలరాస్తూ బడ్జెట్ కాగితాలకే పరిమితం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గుండా రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజుకు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో వేంకటేశ్వర రావు, కొల్ముల రమణ, దేవేందర్ నాయక్, వొల్లం మల్లేశం, బర్కాం మల్లేశం, జున్ను రాజేందర్, తేలు రాజు, చందా రాధ కిషన్, సాయి, లచ్చవ్వ, సర్పంచ్ పొనగంటి మహేష్, శీలం సురేందర్, కళ్లేపల్లి దుర్గయ్య, అబ్దుల్ బారి, ప్రవీణ్, నందు నాయక్, గుండా మధు, ధర్మయ్య, బానోవత్ వసంత్ బానోవత్ తిరుపతి పాల్గొన్నారు.