Jeevan Reddy | సారంగాపూర్, సెప్టెంబర్ 17: గిరిజనులకు 6శాతం ఉన్న రిజర్వేషన్లను కేసీఆర్ ప్రభుత్వంలో 10శాతం పెంచిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌ది అని తెలంగాణ రాష్ట్రం సాకారం అయిన తర్వాత గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం తండాలను ప్రత్యేక గ్రామాలుగా ఏర్పాటు చేసి గిరిజనుల ఆత్మబంధువుగా కేసీఆర్ నిలిచాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని ధర్మనాయక్ తండా, మ్యాడారం తండాల్లో జీవన్ రెడ్డి, జడ్పీ మాజీ చైర్మెన్ దావ వసంత గురువారం పర్యటించి గిరిజన తండాల్లో కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాల కార్యక్రమాల్లో పాల్గొని కేసీఆర్ చిత్రపటాలకు గిరిజనులతో కలిసి పాలాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యాచారం తండాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతు భారత రాజ్యంగంలోనే ఎస్సీలకు, ఎస్టీలకు జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టంగా పేర్కొన్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లంబాడీలను గిరిజనులని అందురు అదే మన తెలంగాణకు వచ్చె సరికి ఇక్కడి ఉన్నవారిని బీసీలని అందురని, ఒకే రాష్ట్రంలో ఒక జాతి ఒక ప్రాంతంలో గిరిజనులని, మరొక ప్రాంతంలో బల హీనవర్గాలని అనేవారని, అప్పుడు ఎంత వివక్ష ఉందో తెలిసిందన్నారు. దీన్ని సరిచేసే విధంగా మొత్తం రాష్ట్రం అంత ఒకేలా ఉండాలని లంబాడాలను గిరిజనుల్లో కలిపారని కాని మన ప్రాంతంలో గిరిజను ల్లో కలిపిన రిజర్వేషన్లు వర్తింప చేయాలని కదా అని అన్నారు. నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లను 6శాతం చేశారు. ఆది కేవలం సిమాంద్ర వరకే సరిపోతుందని అన్నారు.
మన దగ్గర ఆదివాసి గూడెంలు, లంబాడ తండాలు ఉన్నాయని 6శాతం రిజర్వేషన్లు సరిపోవని జనాభ ప్రతిపాదికన రిజర్వేషన్లు ఉండాలని ఆనాడు కేసీఆర్ 10 శాతం చేసారని నేడు తెలంగాణ రాష్ట్రo లోని గిరిజన తండాల్లో సంబరాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. గిరిజనులకు కావాల్సిన హక్కులను పూర్తి స్థాయిలో కల్పించాల్సి బాధ్యత ప్రభు త్వంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 33 జిల్లాల్లో కేసీఆర్ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇవ్వాల ఆంధ్ర రాష్ట్రం మనకంటే పెద్దదని మెడికల్ సీట్లు మాత్రం ఆంద్ర కంటే తెలంగాణకు ఎక్కువ వచ్చియని ఎలా వచ్చయంటే కేసీఆర్ దూరదృష్టితో 33జిల్లాల్లో 38 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడంతో మెడికల్ సీట్లు కనకు ఎక్కువగా వచ్చాయన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో 11వేల మెడికల్ సీట్లు ఉన్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం 11 వందల మంది గిరిజన బిడ్డలు డాక్టర్లు చదువుకునే అవకాశం ఇవ్వాల కేసీఆర్ కల్పించారని అన్నారు. విద్యకు సంబందించి రాష్ట్రంలో గురుకులను ఏర్పాటు చేశారని వివిధ వర్గాల విద్యార్థులకు విద్య సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఈ ప్రభుత్వంలో ఈ పాఠశాలలు అన్ని కలిపి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ ఆరంబించబోతున్నరని ఈ పాఠశాలలకు ఏవిధమైన విధివిధానాలు లేవన్నారు. ఈవాల్ల కొత్తగా ఏర్పాటు చేస్తే కొత్త చేరికలు ఉండాలని కాని ఉన్నవాటిని అన్నింటిని తీసుకెల్లి అందులో కలుపుతామంటే ఊరుకునేది లేదన్నారు. ప్రస్తుతం ఉన్న గురుకులాలు, వివిధ ఆశ్రమ పాఠశాలలు అలాగే ఉండాలని కొత్తగా యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్స్ ఏర్పాటు చేసుకుంటు మాకు అభ్యంతరం లేదన్నారు. బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ ఏర్పాటు చేసిన గురుకులాలను యదావిధిగాకొసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం చేయడం తప్పడన్నారు.
కన్నేపల్లి నీటిని ఎత్తిపోస్తే అన్నరంలోకి వస్తాయి. అక్కడి నుండి సుందిల్లకు సుందిల్ల నుండి ఎల్లంపల్లి వస్తాయన్నారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు సంబందం లేకుండా కన్నేపల్లి నుండి నీటిని ఎత్తిపోయవచ్చని పేర్కోన్నారు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రైతాంగం అంత ఆందోళన చెందుతున్నారని అన్నారు. కాల్వనీళ్లు ఇవ్వవు, కరెంట్ ఇవ్వవు ఇచ్చే 12 గంటల కరెంట్ ఎపుుడస్తుంతో ఎప్పుడు పోతుందో తెలియదు అన్నారు. ఒడ్డెక్కించాలని ఆర్వాత రఖికి సాధ్యం కాకుంటే క్రాఫ్ హలిడే ప్రకటించి ఎకరానికి 20వేలు చెల్లించాని అన్నారు. సాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, ఎరువులు కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. లేదంటే రైతులంత ఆందోళన చేయక తప్పదని హెచ్చరించారు. జడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత మాట్లాడుతూ అనాడు గిరిజనులు పడుతున్న బాధలను తెలుసుకుని రాష్ట్రం ఏర్పాటు కాగానే గిరిజన తండాలను గిరిజనలే పరిపిలన చేయాలనే ఉద్దేశ్యంతో ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ అని అన్నారు. 2022లో ఇదే రోజు గిరిజనులకు 6శాతం ఉన్న రిజర్వేషన్లను 10శాతం పెంచారని అన్నారు. 1956 నుండి 1976 వరకు గిరిజనుల రిజర్వేషన్ బీసీలుగానే గుర్తించారని చెప్పారు. 1986లో ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో గిరిజనులకు 6శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు తెలిపారు. ప్రతీ పది సంవత్సరాలకు ఒక సారి కులగణను, జనగణన చేసి జనాభ ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచాల్సి ఉంటుందన్నారు. గిరిజనలను ఎవరు పట్టించుకోలేదని కేసీఆర్ ఉద్యమ నాయకుడు గిరిజనుల కష్టలను తెల్సుకుని వారికి 6శాతం ఉన్న రిజర్వేషన్లను 10శాతం వరకు పెంచినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు భుక్య భారతి చిరంజీవి, ఆకుల రమేష్, సంతోష్ నాయక్, నాయకులు కొండ్ర రాంచంధర్ రెడ్డి, తేలు రాజు, సాగి సత్యం రావు, బేతి పుర్ణంధర్ రెడ్డి, మొత్కురి ప్రసాద్ గౌడ్, ఒడ్నాల జగన్, ఎరుకొండ రాజు, జోగినిపెల్లి శ్రీనివాస్, భుక్య అరుణ్, గంగమల్లయ్య, బందెల రమేష్, కర్నె నర్సింహ రెడ్డి, సాతాల్ల రమేష్, జేర మహేస్, రామమల్లు, అజ్మిర శ్రీనివాస్, ప్రభాకర్, సతీష్, సాంబారి గంగాధర్, ఆర్రె ప్రేమనందం, శ్రీనివాస్, ఆయా గ్రామాల గిరిజనే నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.