Sultanabad | సుల్తానాబాద్ రూరల్ మే 10: విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు తల్లిదండ్రులు తమ వంతు కృషి చేయాలని హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో శనివారం ఇటీవల విడుదలైన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ప్రతిభ కనబరిచిన జిల్లా స్వర్ణకారుల కుటుంబాల కు చెందిన విద్యార్థిని విద్యార్థుల ప్రతిభ పురస్కారం కార్యక్రమాన్ని పెద్దపెల్లి జిల్లా స్వర్ణకార సంఘం, సుల్తానాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం సహకారంతో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువా కప్పి సత్కరించారు. ప్రోత్సాహ బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జిగారు జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులు విద్యార్థులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ చదువుల్లో రాణించే దిశగా చూడాలన్నారు. విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి విద్యా బోధన నేర్పించిన గురువుల తో పాటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సినీ నటులు సంపూర్ణేష్ బాబు, బలగం సత్యనారాయణ, రాజయ్య, పెద్దపెల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు రంగు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీరామోజు రాజు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కోశాధికారి కనపర్తి భాస్కరాచారి, జిల్లా రాష్ట్ర నాయకులు కందుకూరి పూర్ణాచారి, సుల్తానాబాద్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు పొలాస సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు( పెద్దన్న), వర్కింగ్ ప్రెసిడెంట్ కాసర్ల రాజమౌళి, ఉపాధ్యక్షులు కందుకూరి ఈశ్వరా చారి, చిరు మోజు వీరాచారి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోలాస ప్రదీప్ కుమార్, వేణు, బెజ్జంకి రవి, చందు, మహేందర్, శ్రావణ్ , శ్రావణ్, సదానందం ,రాజేందర్, వెంకటస్వామి, , కట్ట సత్యం, రవీందర్ పాల్గొన్నారు.