Etela Rajender | పంటలకు సరిపడా కరంటు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని, కనీసం పంటలకు సరిపడా కరంట్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మల్కాజిగిరి ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.
- పంటలకు సరిపడా కరంటు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం.. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్
- అభివృద్ధిలో విఫలం, రాజకీయాలకే కాంగ్రెస్ ప్రాధాన్యమని విమర్శ
Etela Rajender | చిగురుమామిడి, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని, కనీసం పంటలకు సరిపడా కరంట్ ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మల్కాజిగిరి ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఉద్యమ సహచరుడు, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు గీకురు రవీందర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎంపీ ఈటల రాజేందర్ శుక్రవారం మృతుడి కుటుంబాన్ని రవీందర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ సహచరుడిని కోల్పోవడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు.
కనీసం పంటలకు 8 గంటలు కూడా కరంటు ఇవ్వలేని దుస్థితిలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధికి కాకుండా రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజా సమస్యలపై దృష్టి సారించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. సరైన విద్యుత్ లేక మక్క, వరి, పత్తి పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు రోడ్డుపైకి వచ్చి ధర్నా రాస్తారోకోలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సింగిల్ విండో చైర్మన్ చల్లా నారాయణరెడ్డి, గురుకుల పల్లె సర్పంచ్ గురుకుల మధుసూదన్ రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, మాజీ జడ్పీటీసీ శ్రీరామ్ శ్యామ్, నాయకులు కందుల సంధ్యారాణి, జన్నపు రెడ్డి సురేందర్ రెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, చొప్పరి వేణు, పిట్టల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
తెల్లారేలోగా ఊరంతా నేలమట్టం.. అర్ధరాత్రి వేళ.. పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు
కరెంట్ కోసం ఎదురుచూపులే.. కోతలు, లోవోల్టేజీ సమస్యలపై రైతుల ఆందోళనలు.. పలుచోట్ల ధర్నాలు, సబ్స్టేషన్ల ముట్టడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

