Kapu community |వేములవాడ, జూన్ 9: రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మున్నూరు కాపు రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కొండ దేవయ్య అన్నారు. సోమవారం ఆయన వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యం సత్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాపు సామాజిక వర్గంలోని శాసనసభ ఎన్నికైన ఆది శ్రీనివాసులు మంత్రి పదవి ఇవ్వాలని అన్నారు.
మరో మూడు మంత్రి పదవుల లోనైనా కాపు సామాజిక వర్గానికి న్యాయం చేయాలని కోరారు. ఆది శ్రీనివాస్ కు మంత్రి పదవి ఇవ్వాలని 33 జిల్లాల్లో సమావేశాలు, ప్రెస్ మీట్ లు నిర్వహించి కాపు సామాజిక వర్గం నుండి బలంగా మా వాదనను వినిపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కూరగాయల కొమరయ్య, పట్టణ కాపు సంఘం అధ్యక్షులు కోయినేని బాలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పోంచెట్టి శంకర్, తోటరాజు, నామాల పోశెట్టి, బింగి శ్రీనివాస్, మహేష్, దేవరాజు తదితరులు ఉన్నారు.