Census Program | పెగడపల్లి : పెగడపల్లి మండలంలో చేపట్టనున్న జనగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ సయ్యద్ నిజాముద్దీన్ పేర్కొన్నారు. పెగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన గణనకు సంబంధించి ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు నిర్వహించే మూడు రోజుల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ జనగణన లో భాగంగా అన్ని గ్రామాల్లో ప్రతీ ఇంటింటికి వెళ్లి నమోదు కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సులోచన, ఆర్ఐ శ్రీనివాస్, జమున ఉన్నారు.