Thank you Ramanna | సిరిసిల్ల టౌన్, జూలై 24: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏటా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతన్నారు. పేదింటి అడబిడ్డల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన కేసీఆర్ కిట్ పథకాన్ని రేవంత్ సర్కారు అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిలిపివేయగా ఈ జన్మదిన వేడుకల సందర్భంగా కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బాలింతలకు కేసీఆర్ కిట్ల పథకానికి శ్రీకారం చుట్టారు. గిఫ్ట్ ఏ స్మైల్ భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం 4910 కేసీఆర్ కిట్ల పంపిణీ చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
అధినేత ఆదేశాల మేరకు గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా చేపట్టిన కేసీఆర్ కిట్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. వాడవాడలా పార్టీ శ్రేణులు కేసీఆర్ కిట్లను ఇంటింటికీ వెళ్లి, పలు చోట్ల వేదికల ద్వారా పంపిణీ చేశారు. కేసీఆర్ కిట్లను చూసిన బాలింతలు మురిసిపోయారు. ప్రభుత్వం ఇవ్వకపోయినా మా రామన్న మా కోసం కిట్లను పంపాడంటూ సంబురపడ్డారు.
కేటీఆర్కు స్పెషల్ థాంక్స్: సారిక, సుందర్యనగర్, సిరిసిల్ల
ktr Birthday
కేటీఆర్ సార్ కు స్పెషల్ థాంక్స్. గవర్నమెంట్ పట్టించుకోకపోయిన మా అన్న మా గురించి ఎప్పటికీ ఆలోచిస్తడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ పథకం పెట్టారు. రేవంత్ రెడ్డి వచ్చాక కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆపేశాడు. కరోనా టైంలో గిఫ్ట్ ఎ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్ ప్రతీ సంవత్సరం ఓ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం నిలిపివేసిన కేసీఆర్ కిట్ పథకాన్ని ఈ రోజు రామన్న బర్త్ డే సందర్భంగా మా అందరికీ కిట్స్ ఇవ్వడం సంతోషంగా ఉంది.ధన్యవాద్ కేటీఆర్ సాబ్: ఎండీ సమ్రీన్, గొల్లపల్లి
ktr Birth day
కేసీఆర్ సాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ కాన్సులో కేసీఆర్ కిట్ పథకం ఇచ్చిండ్రు. ఆ తరువాత రెండో కాన్పు సిరిసిల్ల గవర్నమెంట్ దవాఖాన్లనే అయ్యింది. కానీ కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రావడంతో కేసీఆర్ కిట్ తీసేసినరని డాక్టర్లు చెప్పిండ్రు. ఇప్పుడు కేటీఆర్ సార్ జన్మదినం సందర్భంగా నా కొడుకుకి కేసీఆర్ కిట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు వచ్చి కిట్ ఇచ్చారు. గరీబోళ్లకు ఎప్పుడూ అండగా ఉండే కేటీఆర్ సాబ్ కు ధన్యవాదాలు.