ఆర్టీసీలో త్వరలో సమ్మె సైరన్ మోగనున్నది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, తదితర 21 అంశాలపై ఆరు సంఘాలతో కూడిన జేఏసీ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని బస్ భవన్లో సీఎండీ సజ్జనార్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఫిబ్రవరి 9 వరకు తమ డిమాండ్లపై యాజమాన్యంగానీ, ప్రభుత్వంగానీ స్పందించకుంటే ఆ తర్వాత మొదటి డ్యూటీ నుంచే సమ్మెను ప్రారంభిస్తామని జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన సమ్మె నోటీస్‌లో వివిధ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.
కరీంనగర్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీలో త్వరలో సమ్మె జరగనున్నది. ఈ మేరకు హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం సాయంత్రం ఆర్టీసీ సీఎండీ సజ్జనార్‌కు ఆరు సంఘాల ఆధ్వర్యం లో జేఏసీ నాయకులు సమ్మె నోటీస్ ఇచ్చారు. వచ్చే నెల 9 వరకు అల్టిమేటం ఇచ్చారు. ఆ తర్వాత మొ దటి డ్యూటీ నుంచి సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. ఆర్టీసీ ఉద్యోగులు ప్రధానంగా కాంగ్రెస్ మేనిఫెస్టో హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో ఈ హామీలను అమలు చేయాలని కోరుతూ మంత్రులను కలిసి విజ్ఞప్తులు ఇచ్చారు. సీఎంను కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని ఉద్యోగ సం ఘాల నాయకులు వాపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాము సమ్మెకు దిగాల్సి వస్తోందని స్పష్టం చేస్తున్నా రు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలలు గడుస్తు న్నా దీనిపై ఉలుకూ పలుకు లేకుంటా పోయింది. వెంటనే విలీన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డి మాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా, 2021 నుంచి రావాల్సిన జీతభత్యాల సవరణ ఇంత వరకు జరగ లేదని చెబుతున్నారు. మాస్టర్ స్కేల్ విధానం వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక పక్క డ్రైవర్లు, కండక్టర్లు పని భారంతో గుండె పోట్లకు గురై మరణిస్తుంటే యాజమాన్యం చెకింగ్‌ల పేరుతో జరుగుతున్న వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసే నడపాలి
కొత్త ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో అద్దె వాహనాలను తీసుకొస్తున్నారని, ఈ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు, ఆర్టీసీకి సంబంధం లేదని, ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మొత్తం ప్రైవేట్ వ్యక్తులకే చెందుతోందని, ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీయే తీసుకుని నడపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దీని వల్ల ఆ బస్సులు సంస్థకే చెందుతాయనేది కార్మికుల భావన. ఎలక్ట్రిక్ బస్సులపై ప్రైవేట్ గుత్తాధిపత్యం ఉండరాదని, తమకు ఉద్యోగ భద్రత కరువవుతోందని వాపోతున్నారు. సంస్థలో రిటైర్డ్ అయిన తర్వాత ఉన్నవారితోనే పనిచేయిస్తున్నారని, పనిభారం తట్టుకోలేక ఆర్టీసీ కార్మికులు అనారోగ్యంతో రెఫరల్ హాసిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తోందని, దీనికితోడు యాజమాన్యం వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని కార్మికులు వాపోతున్నారు.
కార్మికులతో 14 నుంచి 16 గంటలు డ్యూటీ చేయిస్తూ తమకు భారాన్ని మోపుతున్నారని, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా కార్మికులకు రావాల్సిన ఎన్‌క్యాష్‌మెంట్ ఇంత వరకు చెల్లించ లేదని, కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నా యాజమాన్యం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. 2024 నుంచి రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు, కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించ లేదని, గడిచిన ఐదేళ్లుగా కార్మికులు యూనిఫాం కూడా ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇలా అనేక సమస్యలను సమ్మె నోటీసులో ప్రస్తావించిన జేఏసీ నాయకులు ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
పరిష్కరించకుంటే సమ్మెకే..
ఆర్టీసీ యాజమాన్యం ముందు తాము పెట్టిన డిమాండ్లను పరిష్కరించకుంటే సమ్మె అనివార్యం అవుతుంది. సమ్మె చేయాలనేది మా ఉద్దేశం కాదు. మా పట్ల యాజమాన్యం, ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు మారాలి. ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా ఈ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంటోంది. రూ.1.50 కోట్లు పెట్టి బస్సులు కొంటే కేంద్ర ప్రభుత్వం రూ.35 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. ఈ పని ఆర్టీసీ యాజమాన్యమే చేయవచ్చుకదా.. అనేది మా భావన. ప్రైవేట్ యాజమాన్యాలకు వీటిని అప్పగించి ఆర్టీసీ ఆస్తులకు కట్టబెడుతున్నారు. వీటి వల్ల కార్మికుల, భద్రతకు, ఆర్టీసీకి ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రధాన హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు మర్చిపోతోంది. ఈ విషయాన్ని అడిగేందుకు మంత్రులు, ముఖ్యమంత్రి వద్దకు వెళ్లితే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. పీఏలకు వినతి పత్రాలు ఇచ్చి వస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సమ్మె ఒక్కటే మార్గమని భావిస్తున్నాం.
ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లు..