తెలంగాణ తెచ్చిన నేత కేసీఆర్
తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు.
- దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ఆయనదే
- మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగం
- ఆంధ్రా పాలకుల చేతిలో పెట్టే రేవంత్ కుట్రలను సహించం
- రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆరే రక్షణ కవచం
- బీఆర్ఎస్ శ్రేణులు.. పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
- అమరుల త్యాగాలను స్మరించుకొని జెండాలు ఎగురవేసిన నాయకులు
- రాష్ర్టాన్ని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని పిలుపు
పెద్దపల్లి, జూన్ 2 (నమస్తే తెలంగాణ) :తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. సబ్బండ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి కేసీఆర్ చేసిన అలుపెరగని పోరాటం, అమరుల త్యాగాలతోనే స్వరాష్ట్ర కల సాధ్యమైందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం మంగళవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా జిల్లాలో అంబరాన్నంటగా, బీఆర్ఎస్ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అన్ని చోట్లా తెలంగాణ అమరులకు నివాళులర్పించి, వారి త్యాగాలను నెమరేసుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమనేతగా కేసీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రిగా తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన తీరును ప్రశంసించారు.
కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే తెలంగాణ ఆగమైందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణను మళ్లీ ఆంధ్రా పాలకుల చేతిలో పెట్టేందుకు రేవంత్ సరార్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని కాపాడేందుకు కేసీఆర్ ఆధ్వర్యంలో మరో ప్రజా పోరాటం చేస్తామని, తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

