రామగిరి, ఆగస్టు 06 : తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత టీబీజీకేఎస్ నాయకుడు బుద్దె సత్యనారాయణ సేవలు చిరస్మరణీయమని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్ కొనియాడారు. బుద్దె సత్యనారాయణ 12వ వర్ధంతి సందర్బంగా బుధవారం సెంటినరీకాలనీ రాణిరుద్రమదేవి క్రీడా మైదానం వద్ద ఉన్న బుద్దె సత్యనారాయణ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మాట్లాడుతూ… తెలంగాణ మలిదశ ఉద్యమంలో సింగరేణి కార్మికునిగా పనిచేస్తున్నప్పటికీ పూర్తి సమయం కేటాయించి ఉద్యమానికి ఈ ప్రాంతంలో ఊపు తెచ్చారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అహర్నిశలు కృషి చేసిన బుద్దె సత్తన్న తెలంగాణ కళ సాకారాన్ని చూడకపోవడం బాధాకరమన్నారు.
బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కాపురవేన భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు శెంకేషి రవీందర్, బుద్దె సత్యనారాయణ తనయుడు బుద్దె ఉదయ్, మాజీ ఎంపీటీసీలు ధర్ముల రాజసంపత్, మేడగొని రాజన్న, మద్దెల ఓదెలు, వేగోలపు భానుగౌడ్, రొడ్డ శ్రీనివాస్, నాయకులు చెల్కల జవహర్, శ్రీనివాస్ రెడ్డి వేగోలపు మల్లయ్య, దామెర శ్రీనివాస్, ఆసం తిరుపతి, బత్తిని ప్రశాంత్, గిటుకు శ్రీనివాస్, మాచిడి సమ్మయ్య, బండి శ్యామ్, పూర్ణచందర్, గంధం మల్లేష్, ఆసం రాము, బొంకూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.