చొప్పదండి, జూన్16: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. పట్టణంలో తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఆయన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి హాజరయ్యారు. పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి సెంట్రల్‌లైటింగ్, వ్యవసాయ మార్కెట్లో చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. సెంట్రల్‌లైటింగ్ పనుల్లో భాగంగా చేపడుతున్న రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పేయే వారు సహకరించాలని కోరిన ఆయన, పనులు త్వరగా, నాణ్యతతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడారు. ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుండడంతో పట్టణాలు, పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నట్లు తెలిపారు. పట్టణాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కొత్త మున్సిపల్ చట్టాన్ని సవరించి మున్సిపాలిటీలను 68 నుంచి 142కు పెంచి ప్రగతి బాటలో పయనించేలా చేశారని కొనియాడారు. దేశంలో అత్యధిక మున్సిపాలిటీలు ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
స్వరాష్ట్రంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా మార్చడంతో అంతర్జాతీయ నగరాలతో రాజధానికి పోటీపడేలా చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని కీర్తించారు. పట్టణాల్లో బీఆర్ఎస్ సర్కారు టీఎస్‌బీపాస్ వెబ్సైట్ ద్వారా జనన, మరణ ధ్రువీకరణ ధ్రువీకరణ పత్రాల జారీని సులభతరం చేసిందని చెప్పారు. పట్టణాల్లో అర్బన్ మిషన్ భగీరథ పథకం కింద 7వేల91కోట్లతో 7లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చి, ప్రతి ఇంటికి శుద్ధజలం అందిస్తున్నామని వివరించారు. పట్టణంలో పేదల ఆర్థిక భద్రత కోసం 12లక్షల71వేల942 మందికి రూ.15వేల536 కోట్ల ఆసరా పింఛన్లు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రం చేపడుతున్న ప్రజాసంక్షేమ పథకాలకు, జరుగుతున్న అభివృద్ధికి అనేక అవార్డులు వస్తుంటే, ఎలాంటి అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయని బీజేపీ పాలిత రాష్ర్టాలకు నిధులు మంజూరు చేస్తూ తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపెడుతున్నదని మండిపడ్డారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి పట్టణాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచామని, మరింత మెరుగుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, వేడుకల సందర్భంగా ఎమ్మెల్యే సుంకె, ‘మీ ఆరుగుర్రాలు.. మా ఆరుగుర్రాలు’ పాట పాడి సమావేశానికి వచ్చిన వారందరినీ ఉత్తేజపరిచారు. కాగా, చొప్పదండి మున్సిపల్ కార్యాలయ కొత్త భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ కోరారు.
అంతకు ముందు పట్టణానికి వచ్చిన వినోద్‌కుమార్, రవిశంకర్‌ను మహిళలు బతుకమ్మలు, బోనాలు, ఒగ్గుడోలు చప్పుళ్లతో ఘనంగా ఎదుర్కోని ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు చిలుక రవీందర్, కలిగేటి కవిత, శ్రీరాం మధుకర్, పర్లపెల్లి వేణుగోపాల్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, జడ్పీటీసీ మాచర్ల సౌజన్య, సింగిల్ విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, వీర్ల వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, వైస్ చైర్మన్ చీకట్ల రాజశేఖర్, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్ర శేఖర్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త గంగారెడ్డి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ గుడిపాటి వెంకట రమణారెడ్డి, కౌన్సిలర్లు కొట్టె అశోక్, మాడూరి శ్రీనివాస్, మహేశుని సంధ్య, చేపూరి హేమలత, బిజిలి అనిత, వడ్లూరి గంగరాజు, రాజన్నల ప్రణీత, కొత్తూరి మహేశ్, కొత్తూరి స్వతంత్ర భారతీ, పెరుమండ్ల మానస, నలుమాచు జ్యోతి, సర్పంచులు గుంట రవి,పెద్ది శంకర్, సురేశ్, తహసీల్దార్ రజిత, మున్సిపల్ కమిషనర్ శాంతికుమార్, మేనేజర్ ప్రశాంత్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వరెడ్డి, నాయకులు రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, అజయ్, కుమార్, ఏనుగు స్వామిరెడ్డి, మహేశుని మల్లేశం, కొత్తూరి నరేశ్, దండె కృష్ణ, గాండ్ల లక్ష్మణ్, ఎన్ అంజయ్య, సీపెల్లి గంగయ్య, రావన్, మహేశ్, కుమార్, స్వామి పాల్గొన్నారు.
పనిచేసే ప్రభుత్వం మనది
రాష్ట్ర ప్రజలకు ఏది అవసరమో, రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలో తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్. మాది మాటలు చెప్పి తప్పించుకునే ప్రభుత్వం కాదు. ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే ప్రభుత్వం. ప్రజా సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని గర్వంగా చెబుతున్నా. ఒకప్పుడు మేజర్ పంచాయతీగా ఉన్న చొప్పదండిని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయించాం. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రూ.100 కోట్లతో పట్టణాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చుతున్నాం. సీఎం కేసీఆర్ అండదండలతో చొప్పదండి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో ముందుంచేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నా. ఇన్నాళ్లూ ఇటు కన్నెత్తి చూడని, ప్రజా సమస్యలు పట్టించుకోని నేతలు ఎన్నికలు సమీపిస్తుంటే వస్తున్నరు. అసత్య ప్రచారం చేస్తున్నరు. వారి మాటలు నమ్మితే మొదటికే మోసం వస్తది. పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలి.
– సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే,చొప్పదండి