సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర కోరారు.
- టీజీబీ బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర
- కేశవపట్నంలో ఆర్థిక మోసాలపై అవగాహన
శంకరపట్నం, డిసెంబర్ 26: ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ నాగేంద్ర కోరారు. సోమవారం మండలంలో గొల్లపల్లి గ్రామంలో జాతీయ సమగ్ర అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంక్ సేవలు, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్యాంక్ ప్రతినిధులమంటూ అపరిచితుల నుంచి వచ్చే మేసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దన్నారు. ఫోన్‌కు వచ్చే ఓటీపీ, డెబిట్ కార్డుల పిన్, సీవీవీ వంటి నంబర్లు ఇతరులకు చెప్పవద్దన్నారు. అలాంటి గోప్యతా వివరాలను బ్యాంకులు అడగవని గుర్తించాలన్నారు. అలాగే టీజీబీ అందిస్తున్న ప్రత్యేక సేవలను ఖాతాదారులకు వివరించారు.
ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్‌కు డిపాజిట్లపై 7.6 వడ్డీ ఇస్తున్నట్లు తెలిపారు. ఆర్బీఐ, నాబార్డ్ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించారు. అలాగే ప్రత్యామ్నాయ ఫిర్యాదుల పరిష్కారం, సైబర్ నేరాల అడ్డుకట్టకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంతర్గత ఫిర్యాదుల పరిష్కారం, వినియోగదారుల సేవా ప్రమాణాలు తదితర అంశాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ఖాతాదారుల సందేహాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు భవ్యశ్రీ, రేణుక, నరేందర్, వీవోఏలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

