Sunke Ravi Shankar | గంగాధర, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
గంగాధర సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ దూలం బాలగౌడ్, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్ పర్సన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ అనుపమ, ఎంపీడీవో రాము, ఎస్సై వంశీకృష్ణ వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.