Formation Day | తిమ్మాపూర్, జూన్2: మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అధికారులు సంఘాల సభ్యులు జెండాను ఆవిష్కరించి, తెలంగాణ చరిత్రను వివరించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విజయ్ కుమార్, పోలీస్ స్టేషన్లో సీఐ సదన్ కుమార్, ఎస్సై వివేక్, పలు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, కార్యాలయాల్లో శాఖల అధికారులు జెండాను ఆవిష్కరించారు.
అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల రమేష్ గులాబీ జెండాను ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్రను వివరించారు. కేసీఆర్ తోనే తెలంగాణ సాధ్యమైందని, తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని దేవేందర్ రెడ్డి, రావుల రమేష్ అభివర్ణించారు.