Education | జగిత్యాల, జులై 7: జగిత్యాల జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించిన తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ సమావేశం విజయవంతమైంది. ఉన్నత విద్య చదువుల కోసం ఏర్పడిన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి జగిత్యాల జిల్లాలోని పలువురు విద్యార్థులు భారీగా హాజరయ్యారు. హెల్పింగ్ హాండ్స్ అధినేత ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో ఉన్నత విద్య, జాతీయ, రాష్ట్ర స్థాయి అవకాశాలు సదస్సు ఏర్పాటు చేశారు.
ఇంటర్, డిగ్రీ, ఐఐటి, నిట్, త్రిబుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ ప్రవేశ పరీక్షలు, ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాలు తదితర అంశాలపై ఎడ్యుకేషనల్ అవేర్నెస్ సెమినార్ కు ముఖ్య అతిథిగా జేఎన్టీయూ కొండగట్టు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డాక్టర్ బీ ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడవాళ జ్యోతి, లక్ష్మణ్, ప్రముఖ సామజిక వేత్త గంగ నర్సయ్య, జగిత్యాల జిల్లా ఆర్టీఏ మెంబెర్, వర్తక సంఘ అధ్యక్షుడు కంఠాల శ్రీనివాస్, కొక్కుల ప్రభాకర్, మామిడాల మునిందర్, విద్యార్థులు, పేరెంట్స్ భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.
భవిష్యత్ బాటకు మంచి మార్గం ఎన్నుకొవాలనుకునే తపన ఉన్న విద్యార్థులకు జాతీయ, రాష్ట్ర స్థాయి ఎంట్రన్స్ పరీక్షలు, ఇంజనీరింగ్ టాప్ కాలేజీ అడ్మిషన్ గురించి, వారి సందేహాలను తీర్చారు. ఉచితంగా ఉస్మానియా యూనివర్సిటి ప్రొపెసర్ ఏ రవీందర్ పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు టెక్నికల్ స్పాన్సర్ గా జ్యోతిస్మతి కళాశాలలు, వాగేశ్వరీ, పెద్దపల్లి మదర్ థెరిస్సా కళాశాలలు మేనేజ్మెంట్ గా వ్యవహరించాయి.
ఉస్మానియా, జేఎన్టీయూ యూనివర్సిటీ పరిధిలో గల ప్రముఖ ఇంజనీరింగ్, ఫార్మసీ, లా, హోటల్ మానేజ్మెంట్, ఫాషన్ డిజైన్, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల ప్రవేశాల ఉచిత అడ్మిషన్ గైడెన్స్ కోసం 9700344777 నందు సంప్రదించవచ్చని సూచించారు.