Teachers | ధర్మారం, అక్టోబర్ 15: ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ప్రాధాన్యత కల్పించడం ఎంతో హర్షనీయమని పిఎస్ హెచ్ఎంఏ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ నూతి మల్లయ్య పేర్కొన్నారు.
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ప్రొసీడింగ్ నంబర్ 70 ద్వారా ఇక నుండి ప్రాథమిక పాఠశాలలలో ఎఫ్ఎల్ఎన్ పర్యవేక్షణ బాధ్యతలలో నోడల్ ఆఫీసర్లుగా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను, మెంబర్లుగా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు అవకాశం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు ఆయన అన్నారు.
ఈ ఉత్తర్వుల నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్మారం మండలంలోని పలు ప్రాథమిక పాఠశాలల్లో సంఘీభావంగా గ్రీన్ బ్యాడ్జ్ ధరించి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు విధుల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Devarakonda Rural : 18న నిర్వహించే బీసీ బంద్‌ను జయప్రదం చేయాలి : సతీశ్ గౌడ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.