కరీంనగర్ జిల్లాలో పట్ట భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీకి 53.05శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 69.25శాతం ఓటింగ్ నమోదైంది. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. ఉదయం 8గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ.. ఓటర్లు పెద్దగా కేంద్రాలకు రాలేదు. 10గంటల వరకు కేవలం పట్టభద్రుల స్థానంలో 6.37శాతం, ఉపాధ్యాయ స్థానంలో 35శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 12గంటల వరకు కాస్త పుంజుకుని 18.9శాతం పట్టభద్రులు, 35శాతం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ శాతం పెరిగింది. ఆ తర్వాత మండలాల వారీగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం 2 గంటల వరకు 34.61శాతం పట్టభద్రులు, 58.35శాతం ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక గడువు ముగిసేసరికి సాయంత్రం 4 గంటల వరకు 53.05శాతం పట్టభద్రులు, 69.25శాతం ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
– కరీంనగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని పలు కేంద్రాల్లో రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయం త్రం 4 గంటలలోపు కేంద్రాల్లో ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందు కు అధికారులు రాత్రి 7 గంటల వరకు అవకాశం కల్పించారు. ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి, ఓటింగ్ సరళిని అడిగితెలుసుకున్నారు. సీపీ అభిషేక్ మొహంతి నగరంలోని పలు పోలింగ్స్టేషన్లలో పరిస్థితిని పర్యవేక్షించారు. కేంద్రాల నుంచి పోలీస్ పహారా మధ్య కరీంనగర్‌లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలోకి బ్యాలెట్ బాక్స్‌లు తెప్పించారు.
చిగురుమామిడి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రానికి సమీపంలో కాంగ్రెస్ అభ్యర్థి తరపున డబ్బులు పంపిణీ చేస్తున్నారని బీజేపీ నేతలు వాదనకు దిగారు. స్థానిక నాయకుడు ఒకరి వాహనంలో వాహనాలకు సంబంధించిన మూడు నంబర్ ప్లేట్లను బీజేపీ నాయకులు పట్టుకున్నారు. ఇదే వాహనానికి వేర్వేరు నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకుని డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకులతో వాదనకు దిగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నది. వాహనాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అలాగే పోలింగ్ కేంద్రం వద్ద బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బోయినపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తిమ్మాపూర్ సీఐ స్వా మికి మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఓటర్లు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కరీంనగర్ కశ్మీర్‌గడ్డలోని మహిళా కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఎండలోనే నిలబడి ఓట్లు వేయాల్సి వచ్చింది. ఇక్కడ తాగేందుకు మంచినీటి సదుపాయం కూడా ఏర్పాటు చేయలేదని ఓటర్లు వాపోయారు. వైద్య సిబ్బంది కూడా ఎండలోనే విధులు నిర్వహించాల్సి వచ్చింది.
కరీంనగర్‌లోని వాణినికేతన్ ఉన్నత పాఠశాలలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ముకరంపురలోని ప్రభుత్వ ప్రాథమి క పాఠశాలలో ఆర్వో, కలెక్టర్ పమేలా సత్ప తి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, వివిధ పోలింగ్ స్టేషన్లలో టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావు, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి, బోయినపల్లి మండల కేంద్రంలో స్వతంత్ర అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అలాగే చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, బీఆర్ఎస్ రాష్ట్ర నేత వీర్ల వెంకటేశ్వర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి గురువారం జరిగిన ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కంపు వచ్చే నెల 3న చేపట్టనున్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియం లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించడానికి ఇప్పటికే అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఓట్ల లెక్కింపు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్వో, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
కార్పొరేషన్, ఫిబ్రవరి 27: కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పూట మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం వరకు భారీగా పెరిగింది. మాజీ ఎంపీ వినోద్‌కుమార్, మాజీ మంత్రి ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ స్థానిక వాణినికేతన్ ఉన్నత పాఠశాలలో, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య ర్థి, అల్ఫోర్స్ నరేందర్‌రెడ్డి మంకమ్మతోటలో ని దన్గర్‌వాడీ ఉన్నత స్కూల్లో, స్వతంత్ర అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావు స్థానిక సెయిం ట్ జాన్సన్ ఉన్నత పాఠశాలలో, స్వతంత్ర అభ్యర్థి రవీందర్‌సింగ్ ప్రభుత్వ సైన్సింగ్ వింగ్ జూనియర్ కళాశాలలో ఓటేశారు.
గంగాధర, ఫిబ్రవరి 27: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో గ్రాడ్యుట్ స్థానానికి 2,936 మందికి గానూ 1,954మంది ఓటేయగా 66.55పోలింగ్ శాతం నమోదైంది. అలాగే టీచర్ స్థానానికి 110మందికి గానూ 94మంది ఓటేయగా పోలింగ్ 85.45శాతం నమోదైంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పట్టభద్రుల ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి ప్రస న్న హరికృష్ణ, స్వతంత్ర అభర్థి బండారి రాజ్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభం నాగర్లే పోలింగ్ సరళిని పరిశీలించారు.
రామడుగు, ఫిబ్రవరి27: జిల్లా కేంద్రంలోని ముకరంపుర పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వరరావు ఓటుహక్కును వినయోగించుకున్నారు. అలా గే రామడుగు మాజీ జడ్పీటీసీ వీర్ల కవిత హౌ సింగ్‌బోర్డు కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌బూత్‌లో ఓటేశారు.
శంకరపట్నం, ఫిబ్రవరి27: మండల కేం ద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 71శాతం పట్టభద్రుల, 96శాతం టీచర్ ఎమ్మెల్సీ పోలిం గ్ నమోదైంది. 346 పోలింగ్ బూత్‌లో 1,008మంది గ్రాడ్యుట్ ఓటర్లకు గానూ 710మంది, 347పోలింగ్ బూత్‌లో 1,001 మంది గ్యాడ్యుయేట్కు గానూ 713 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 51మంది టీచర్ ఓటర్లకు గానూ 49మంది ఓటు వేశారు. కాగా, ఓటింగ్ సరళి నెమ్మదిగా జరగడంతో క్యూలో నిలుచున్న గ్రాడ్యుయేట్ ఓటర్లు అసహనానికి గురయ్యారు.
చొప్పదండి, ఫిబ్రవరి27: మండల కేం ద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో గ్రాడ్యుయేట్ స్థానానికి 3,092మందికి గానూ 2,102మంది ఓటేయగా పోలింగ్ 67.98 శాతం నమోదైంది. అలాగే టీచర్ స్థానానికి 114మందికి గానూ 110మంది ఓటుహకు వినియోగించుకోగా 98శాతం పోలింగ్ జరిగింది. కేంద్రాన్ని ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. టాస్‌ఫోర్స్ సీఐ రవీందర్, ఎస్ఐ అనూష కేంద్రాలను పర్యవేక్షించారు.
గన్నేరువరం, ఫిబ్రవరి27: మండల కేం ద్రంలో గ్రాడ్యుయేట్ స్థానానికి 842మందికి గానూ 572మంది ఓటేయగా పోలింగ్ 67.9 శాతం నమోదైంది. అలాగే టీచర్ స్థానానికి పది మందికి గానూ అందరూ ఓటుహకును వినియోగించుకున్నారు.
చిగురుమామిడి, ఫిబ్రవరి 27: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల స్థానానికి 2,230మందికి గానూ 1,483మంది ఓటేయగా పోలింగ్ 66.50 శాతం నమోదైంది. అలాగే టీచర్ స్థానానికి 51మందికి గానూ 49మంది ఓటేయగా పోలింగ్ 96శాతం నమోదైంది. కాగా, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మండల కేంద్రంలో ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుం డా తిమ్మాపూర్ సీఐ స్వామి, ఎస్ఐ రాజేశ్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు.
తిమ్మాపూర్, ఫిబ్రవరి 27: ఎల్ఎండీ కాలనీలో గల జడ్పీ హైస్కూల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 2,866మందికి 1,970 మంది ఓటేయగా పోలింగ్ 68.78శాతం నమోదైంది. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 87 మంది గానూ 81మంది ఓటేయగా 93.10 శాతం పోలింగ్ నమోదైంది. ఓటింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల అబ్జర్వర్ బుద్ధ ప్రకాశ్, సీపీ అభిషేక్ మొహంతి పర్యవేక్షించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీఐ స్వామి, ఎస్ఐ వివేక్ చర్యలు తీసుకున్నారు.
మానకొండూర్, ఫిబ్రవరి 27: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల స్థానానికి 3,548మందికి గానూ 2,344మంది ఓటేయగా పోలింగ్ 66.06 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే టీచర్ స్థానానికి 48 మందికి గానూ 45మంది ఓటుహక్కు వినియోగించుకోగా, పోలింగ్ 93.7 శాతం పోలింగ్ నమోదైంది. కేవలం నాలుగు పోలింగ్ బూత్‌లు మాత్రమే ఏర్పాటు చేయ గా, అధికారుల తీరుపై ఓటర్లు అసహనం వ్య క్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహ న్ ఓటుహక్కు వినియోగించుకున్నా రు. పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ రూరల్ ఏసీపీ శుభమ్ప్రకాశ్ పరిశీలించగా, సీఐలు లక్ష్మీనారాయణ, సంతోష్‌కుమార్ పర్యవేక్షించారు.
వీణవంక, ఫిబ్రవరి 27: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ స్థానానికి 41మందికి గానూ 39 మంది ఓటేయగా 95శాతం పోలింగ్ నమోదైంది. అలాగే గ్రాడ్యుయేట్ స్థానానికి 2,188 మందికి గానూ 1,430మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 65.35శాతం ఓటింగ్ నమోదైంది. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్-శ్వేత దంపతులు వీణవంకలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హుజూరాబాద్ టౌన్, ఫిబ్రవరి27: పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల స్థానానికి 4,795మందికి గానూ 3,312మంది ఓటుహక్కును వినియోగించుకోగా 69.07శాతం పోలింగ్ నమోదైంది. టీచర్ స్థానానికి 278మందికి గానూ 263 మంది ఓటేయగా 94.60శాతం పోలింగ్ నమోదైంది. హుజూరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ భద్రతా చర్యలను తనిఖీ చేశారు. తహసీల్దార్ కనకయ్య పోలింగ్ సరళిని పరిశీలించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ వీ లక్ష్మీంకాతరావు, మాజీ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, బీఆర్ఎస్ నేత ఇంద్రనీల్, నాయకులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.
సైదాపూర్, ఫిబ్రవరి 27: మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. టీచర్ స్థానానికి 54మందికి గానూ 52మంది ఓటేయగా 96శాతం పోలింగ్ నమోదైంది. గ్రాడ్యుయేట్ స్థానానికి 1,981మందికి గానూ 1,147 మంది ఓటేయడంతో 57శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.
కరీంనగర్ రూరల్, ఫిబ్రవరి 27: పట్టణంలోని సుభాష్‌నగర్ ఉన్నత పాఠశాల, సుభాష్‌నగర్ గర్ల్స్ ఎస్సీ హాస్టల్లో పోలింగ్ కేంద్రా లు నిర్వహించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 263మందికి గానూ 230మంది ఓటేయగా, పోలింగ్ 93.5శాతం నమోదైంది. అలాగే గ్రాడ్యుయేట్ స్థానాలకు 4,126మం ది గానూ 2,550మంది మాత్రమే ఓటు హ క్కు వినియోగించుకోగా పోలింగ్ 61.80 శాతం నమోదైంది. అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయి పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.