Godavarikhani | గోదావరిఖని : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయం జీడికే-11 గనిలో జరిగిన వేడుకల్లో టీబీజీకేస్ కేంద్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి మాట్లాడారు. పోరాటాలతో పురుడు పోసుకొని కార్మికుల హక్కుల కోసం నిరంతరం పాటు పడుతూ గని ప్రమాద బాధితుల పక్షాన పోరాటంతో పురుడు పోసుకున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించుటలో ముందు నిలిచించిందని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో సకలజనుల సమ్మెలో అన్ని సంఘాలను కార్మికులను ఐక్యం చేయడంలో ద్వారా తెలంగాణ సాధించుటలో కీలక పాత్ర పోషించిందని, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందు వరసలో నిలిచి గత ప్రభుత్వాలు పోడగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలను కారుణ్య నియామకాల ద్వారా సాధించి 20వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించడం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమురయ్య, నాయకులు పాల్గొన్నారు.