yoga competitions | కోరుట్ల, ఆగస్టు 25: కోరుట్ల పట్టణంలో నిర్వహించిన జిల్లా స్థాయి యోగబ్యాస పోటీల్లో స్థానిక నవజ్యోతి హై స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో పాఠశాలకు చెందిన హారిక, సహర్షిత, గురువిందర్ సింగ్, హన్విక, ఆకర్ష వర్మ, నిశ్వంత్, శాన్విక, అభిరామ్, భాను నాయక్ రజత పథకాలు సాధించగా, వీరిలో హారిక, సహర్షిత, గురువిందర్ సింగ్ బంగారు పథకాలు కైవసం చేసుకున్నారు.
ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సెప్టెంబర్ 5, 6, 7 తేదీలలో నిర్మల్ లో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ సుజాత సుకుమార్, ఉపాధ్యాయులు, అభినందించారు.