Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, ఫిబ్రవరి 28 : ప్రపంచ టైలర్స్ డే వేడుకలను కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కుట్టుమిషన్ రూపకర్త ఎలియాస్ హోవే చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు.
బట్టలమ్మేవారు ఒకరైతే టైలర్ అనేవారు ముఖ్యుడు అని, మనిషికి బట్టలు ఎలా ఉండాలో అలా కుట్టగలిగే వాడే టైలర్ అంటారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో టైలర్ అసోసియేషన్ అధ్యక్షుడు గూట్ల శ్రీహరి, క్యాషియర్ వొడ్నాల రమేష్, మాజీ అధ్యక్షుడు వొడ్నాల రాజయ్య, గోలి రంగయ్య, పాషికంటి రవీందర్, రావుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.