Singareni | గోదావరిఖని : తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవాలలో భాగంగా రామగుండం ఏరియా-1 పరిధిలోని జీడీకే-1&3 ఇంక్లైన్ గనిలో శనివారం ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం ఏరియా-1 జనరల్ మేనేజర్ డీ లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సింగరేణి కార్మికులను అభినందించారు. ఈ సందర్భంగా జియం డీ లలిత్ కుమార్ మాట్లాడుతూ తాడిచర్ల-2 బ్లాక్ సాధన సింగరేణి సంస్థ భవిష్యత్తుకు ఎంతో కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని జీఎం పేర్కొన్నారు. ఈ విజయోత్సవం మన సంస్థ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ప్రతీ ఉద్యోగి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రామగుండం ఏరియా–1 జీఎం కార్యాలయం అన్ని గనులు డిపారెంట్లలలో తాడిచర్ల–2 బ్లాక్ కేటాయింపు విజయోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ స్వీట్లు పంపిణీ చేసి తాడిచర్ల-2 బ్లాక్ సాధన పట్ల తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందేశంతో కూడిన కరపత్రాలను ఉద్యోగులందరికీ పంపిణీ చేసి ఆ సందేశాన్ని చదివి వినిపించారు. తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజు సాధనతో సింగరేణి సంస్థకు సుస్థిర భవిష్యత్తు లభించిందని, సంస్థ అభివృద్ధి, కార్మిక సంక్షేమం, కొత్త బొగ్గు గనుల సాధన, ఉత్పత్తి వ్యయ నియంత్రణ, సాంకేతిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన రంగంలో విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్యోగులకు వివరించారు.
అనంతరం నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఒకరికి ఒకరు స్వీట్లు, మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలను ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామగుండం రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ సుజోయ్ మజుందార్, ఎస్‌ఓటూ జీఎం చంద్ర శేఖర్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటి జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, జీడీకే-1 గ్రుఫ్ ఏజంట్ ఎల్ రమేష్, 11 గ్రూప్ ఏజంట్ చిలుక శ్రీనివాస్, జిడీకే ఓసి.5 పివో రమేష్, పర్సనల్ మేనేజర్ తిరుపతి, సీఎంఓఏఐ ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీ పెరుమాళ్ళ శ్రీనివాస్, సీనియర్ పివో హనుమంతరావు, జియం ఆఫీస్ ఇంచార్జ్ రాజు, జీఎం కార్యాలయం ఉద్యోగులు మరియు ఆర్జీ.1 లోని జిడీకే 1,2&2A,11 ఇంక్లైన్ గనులు, మరియు ఓసి.5, అన్ని విభాగాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు