Inspiration Award | ముత్తారం, జూన్ 11: ముత్తారం మండలంలోని అడవీ శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ జావిద్ పాషాకు రవీంద్రభారతిలో వసుంధర విజ్ఞాన వికాస మండలి ఆధ్వర్యంలో స్ఫూర్తి పురస్కారం ప్రధానం చేశారు.
జావిద్ ఎన్నో సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, మోటివేషన్ క్లాసులు, ఎన్జీవోస్ లో అనాథ పిల్లలకు కౌన్సిలింగ్ క్లాసులు, అనాథ పిల్లల హక్కుల కోసం పోరాటం చేయడం అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం ద్వారా వ్యవస్థాపకులు మధు ధర్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏనుగుల నరసింహారెడ్డి, కట్కూరి శంకర్, కే చంద్రశేఖర్ రెడ్డి, దేవి నర్సయ్య, మ్యాజిక్ రాజా, జబ్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.