కార్పొరేషన్/కలెక్టరేట్/కరీంనగర్‌రూరల్/మానకొండూర్/విద్యానగర్/కోర్టుచౌరస్తా/హుజూరాబాద్‌టౌన్/ వీణవంక/ సైదాపూర్/గన్నేరువరం/ తిమ్మాపూర్ రూరల్/ గంగాధర, జనవరి 12: జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలను శుక్రవారం పలు సంఘాలు, యువజన సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జ్యోతి నగర్‌లోని వివేకానంద చౌరస్తాలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు మేయర్ యాదగిరి సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ హాజరయ్యారు. వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్వచ్ఛందంగా సేవలందించిన పలువురికి తెలంగాణ యువజన సమితి ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్‌రావు మాట్లాడుతూ, యువత స్వామి వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కార్పొరేటర్లు రాపర్తి విజయ, గందె మాధవి, గంట కళ్యాణి, కంసాల శ్రీనివాస్, ఆయా సంఘాల నాయకులు రాజు, సత్తినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేకుర్తిలో కృషి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యం లో వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు.
యూత్ ప్రతినిధులు బండారి చంద్రయ్య, దుర్గం లింగమూర్తి, శ్రీనివాస్, బోర్లకుంట రేవంత్, బాలకృష్ణ, జాడి అనిల్, కిరణ్ పాల్గొన్నారు. మీ సేవ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని వృద్ధుల హాస్టల్లో పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు బెజుగం మధు, చిందం వెంకటేశ్, రంగ సంతోష్, శీలం నవీన్, దైద తిరుపతి, కూర సతీశ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో వివేకానంద చిత్రపటానికి కలెక్టరేట్ ఉద్యోగుల సంఘం కార్యదర్శి రవికుమార్, ఉద్యోగులు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు కొండయ్య, రాజ్‌మహ్మద్, అంకయ్య, విశ్వేశ్వరరావు, యాకూబ్ అలీ, రవీందర్, వెంకటేశ్‌నాయక్ పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వివేకానంద చిత్రపటానికి ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఎంపీడీవో దివ్యదర్శన్ రావు, సూపరింటెండెంట్ సంపత్, ఏఈ వెంకటరమణరెడ్డి, రుద్ర రాములు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మానకొండూర్‌లో వివేకానంద చిత్రపటం వద్ద బీజేపీ మండలాధ్యక్షుడు రాపాక ప్రవీణ్, జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్‌రెడ్డి, రంగు భాస్కరాచారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు అంబటి తిరుపతిరాజు, సొన్నాకుల శ్రీనివాస్, కత్తి ప్రభాకర్‌గౌడ్, కంది రాజిరెడ్డి, అశోక్, రమేశ్పటేల్, రమణయ్య, కోటేశ్వర్, శ్రీనివాస్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌లోని వివేకానందుడి విగ్రహానికి ఎంపీ బండి సంజయ్, బీజేపీ సీనియర్ నాయకుడు పోల్సాని సుగుణాకర్ రావు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీ బండి సంజయ్ చేతుల మీదుగా పలువురు యువతీ యువకులకు యువసేవ పురసారాలు అందజేశారు. కార్పొరేటర్ రాపర్తి విజయ, నాయకులు దుర్గం మారుతి, ఆనంద్, దేవేందర్ రావు, తాడూరి బ్రహ్మం, శ్రీనివాస్ గౌడ్, గుడిపాటి జితేందర్ రెడ్డి, బాసం కుమార్, సుమన్, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక మారెట్ కాంప్లెక్స్‌లో అఖిల భారతీయ గ్రాహక్ పంచాయత్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి వేడుకలు నిర్వహించారు.
సంఘం బాధ్యులు భగవాన్ రెడ్డి, నాగమల్ల సురేశ్, శ్రీనివాస్, శ్రీధర్, సురేశ్, శ్రావణ్, బన్ని, అన్వేష్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. జిల్లా కోర్టులో వివేకానంద చిత్రపటానికి కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లింగంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో సభ్యులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు వాల మహేందర్, సభ్యులు సిరికొండ శ్రీధర్‌రావు, బెజ్జంకి శ్రీకాంత్, పస్తం ఆంజనేయులు, రఘువీర్, కృష్ణార్జునాచారి, గుడిపాటి సత్యం రెడ్డి, బండ శివకుమార్, కటకం శ్రావణ్ పాల్గొన్నారు. హుజూరాబాద్ పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి వేర్వేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. వీణవంక మండలం బేతిగల్‌లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గొట్టుముక్కుల రవీందర్రావు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి, స్వీట్లు పంపిణీ చేశారు. సర్పంచ్ మోరె సారయ్య, ఎంపీటీసీ మోరె స్వామి, ఉపసర్పంచ్ చొప్పరి తిరుపతి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలం లస్మన్నపల్లిలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించగా, ఎస్ఐ ఆరోగ్యం, సర్పంచ్ కాయిత రాములు, పాలకవర్గ సభ్యులు, పాల్గొని నివాళులర్పించారు.
గన్నేరువరం మండల కేంద్రంలో వివేకానంద చిత్రపటానికి తహసీల్దార్ భిక్షపతి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు న్యాత సుధాకర్, పుల్లెల లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లిలో వివేకానంద విగ్రహానికి సర్పంచ్ మేడి అంజయ్య, ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్, రావుల శ్రీనివాస్ గౌడ్, కొయ్యెడ శ్రీనివాస్ గౌడ్, రావుల శంకర్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలో నాయకుడు జంగిలి మహేందర్, నగరంలోని సరస్వతీనగర్‌లోని కపిల్ బాలకుటీర్‌లో హమ్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు సాగర్ వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీనివాస్, బాలకుటీర్ ఇన్చార్జి వకులా దేవి పాల్గొన్నారు.