Swachhta hi seva | కోల్ సిటీ, సెప్టెంబర్ 25: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంను సైతం లెక్కచేయక రామగుండం నగర పాలక సంస్థ అధికారులు స్వచ్ఛతకే నడుం బిగించారు. గోదావరి ఒడ్డున బురదలోని చెత్తను గురువారం తొలగించి శభాష్ అనిపించుకున్నారు. సమష్టి కృషితోనే స్వచ్ఛత సాధ్యమని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి అన్నారు.
స్వచ్ఛత హీ సేవలో భాగంగా గురువారం గోదావరి నది పుష్కర ఘాట్ వద్ద నిర్వహించిన ఏక్ దిన్ ఏక్ ఘంటా ఏక్ సాత్ లో నగర పాలక సంస్థ సిబ్బంది, మెప్మా సిబ్బంది పాల్గొని సమగ్ర పరిశుభ్రత డ్రైవ్ చేపట్టి గోదావరి తీరాన ఉన్న ప్లాస్టిక్, చెత్తను తొలగించారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, క్రమశిక్షణ సంస్కృతి ప్రోత్సహించడానికి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఒక మైలురాయన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సెక్రెటరీ ఉమా సుహేశ్వరరావు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్, ఎంఐఎస్ ఆపరేటర్ శ్రీకాంత్, మెప్మా సీఓలు ఊర్మిళ, శ్వేత, ప్రియదర్శిని, వార్డు అధికారులు, శానిటరీ జవాన్లు, ఏకో వారియర్స్ ప్రతినిధులు శివకృష్ణ, కరుణాకర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.