Vemulawada | వేములవాడ, జూలై 7 : వేములవాడ పట్టణంలోని విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం ఆధ్వర్యంలో రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందేలా దుకాణాలను పరిశీలించిన అధికారులు, లైసెన్సులు, నిల్వలు, రికార్డులు మరియు విక్రయిస్తున్న విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎవరైనా తప్పుగా బ్రాండ్ చేసిన లేదా నకిలీ రసాయనాలు, పురుగుమందులు, ఎరువులు విక్రయించినట్లు గుర్తిస్తే సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా అనుమానాస్పద ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా అధికారికంగా లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుంచే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ తనిఖీలలో వ్యవసాయ అధికారి సాయి కిరణ్, ఎస్సై రామ్మోహన్ గౌడ్ తదితరులు ఉన్నారు.