Purchasing centers | గంగాధర, ఏప్రిల్ 12 : ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యము అమ్మి మద్దతు ధర పొందాలని కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. మండలం కురిక్యాలలో స్థానిక సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సాఫీగా జరిగేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సాఫీగా జరగడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డీసీవో రామానుజచార్యులు, సివిల్ సప్లై డిఎం రజినీకాంత్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, తహసిల్దార్ అనుపమ, రాజగోపాల్ రెడ్డి, పురుమల్ల మనోహర్, బుర్గు గంగన్న, సత్తు కనుకయ్య, కరుణాకర్, దోర్నాల శ్రీనివాసరెడ్డి, దికొండ మధు, ఆకుల ఆంజనేయులు, ముద్దం నగేష్, రెండ్ల శ్రీనివాస్, దోమకొండ మహేష్, అట్ల శేఖర్ రెడ్డి, గునుకొండ బాబు, జవ్వాజి మహేందర్, మేర్జ కొండయ్య, నల్లల రాజేంద్రర్ తదితరులు పాల్గొన్నారు.