చొప్పదండి, మార్చి 20: పొలాలకు నీళ్లు లేక మరోవైపు కరెంట్ సమస్యతో పంటలు ఎందుతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి రైతుల గోస తెలుస్తలేదా అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. గురువారం చొప్పదండి మండలంలోని మల్లన్నపల్లి గ్రామంలో ఎండిన వరి పొలాలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి రవిశంకర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండిపోతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నిరెత్తలేకుండా పోయిందని విమర్శించారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో కెనాల్ కు 24 గంటలు నీళ్లు ఉండి 24 గంటల కరెంటు ఇవ్వడంతో పంటలు పుష్కలంగా పండాయని తెలిపారు. ప్రభుత్వం ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ. 25వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అవగాహన రాహిత్యంతోనే చేతికొచ్చిన పొలాలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు మినుపాల తిరుపతిరావు, మాచర్ల వినయ్, చీకట్ల రాజశేఖర్, గన్ను శ్రీనివాస్‌రెడ్డి, గాండ్ల లక్ష్మణ్, వడ్లూరి భూమయ్య, జహీర్, బీసవేణి రాజశేఖర్ తదితరులున్నారు.