చొప్పదండి, ఫిబ్రవరి 11: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచి.. గులాబీ జెండానే మళ్లీ ఎగురుతుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Sunke Ravi Shankar) ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్ లో మండలంలోని బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు నాయకులతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కరని విమర్శించారు. రేవంత్ రెడ్డి 15 నెలల పాలనలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఒక్క నియోజకవర్గం అభివృద్ధి నోచుకోలేదని విమర్శించారు.
గడిచిన బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగిందని, అది కేసీఆర్ తోనే సాధ్యమైందని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ మోసపూరిత అబద్ధపు హామీలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులంతా సమన్వయంతో పని చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసి ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని కోరారు. అవకాశం రాలేదని ఎవ్వరూ బాధపడొద్దని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఉన్నందున అవకాశాలు కచ్చితంగా వస్తాయని తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తల అభిప్రాయ సేకరణను బలంగా పరిణగలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, ఆర్నకొండ సింగిల్విండ్ చైర్మన్ మినుపాల తిరుపతిరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు ఆరెల్లి చంద్ర శేఖరౌడ్, గడ్డం చుక్కారెడ్డి, మాజీ వైస్ చైర్మన్లు కొత్త గంగారెడ్డి, చీకట్ల రాజశేఖర్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యాక్షులు లోక రాజేశ్వర్రెడ్డి, నాయకులు మాచర్ల వినయ్, బందారపు అజయ్ కుమార్, కొత్తూరి మహేశ్, వడ్లూరి గంగరాజు, కర్రె శ్రీనివాస్, గన్ను శ్రీనివాస్ రెడ్డి ,మాడూరి శ్రీనివాస్, వెల్మ నాగిరెడ్డి, ఏనుగు స్వామిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్, సీపెల్లి గంగయ్య, గొల్లపెల్లి శ్రావణకుమార్ పాల్గొన్నారు.