చొప్పదండి/ గంగాధర, ఏప్రిల్ 19: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఊరూరా కదలిరావాలని, కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం చొప్పదండి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో, గంగాధర మండలం బూరుగుపల్లిలో ముఖ్యకార్యకర్తలతో సన్నాహక సమావేశాలు నిర్వహించగా, సుంకె ముఖ్య అతిథిగా హాజరై ఆయాచోట్ల మాట్లాడారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా చొప్పదండి నియోజకవర్గం కార్యకర్తలు ముందుంటారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా కొట్లాడామో, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న పాలనపై ప్రజల పక్షాన నిలబడి ముందుంటున్నామని చెప్పారు. గ్రామాల్లో ఇచ్చిన లక్ష్యం మేరకు జనాన్ని సభకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ 25 ఏండ్ల ఉద్యమ గుర్తులు, తెలంగాణ అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ నిర్వహిస్తున్న రజతోత్సవ సభలో కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. చొప్పదండి సమావేశంలో మండలాధ్యక్షుడు వెల్మ శ్రీనివాస్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు లోక రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చిలుక రవీందర్, మాజీ జడ్పీటీసీలు ఇప్పనపల్లి సాంబయ్య, మాచర్ల సౌజన్య- వినయ్ కుమార్, మాజీ సర్పంచులు వెల్మ నాగిరెడ్డి, గన్ను శ్రీనివాసరెడ్డి, యువజన సంఘాల సమితి అధ్యక్షులు బంధారపు అజయ్ కుమార్, నాయకులు ఉన్నారు. బూరుగుపల్లి మీటింగ్‌లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, నాయకులు కంకణాల విజేందర్‌రెడ్డి, వేముల దామోదర్, మడ్లపెల్లి గంగాధర్, యండీ నజీర్, రామిడి సురేందర్ పాల్గొన్నారు.